News December 23, 2024

SSA ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: హరీశ్

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు డిమాండ్ చేశారు. హనుమకొండలో దీక్ష చేస్తున్న SSA ఉద్యోగులను ఆయన కలిశారు. కాంగ్రెస్ నేతలు అసెంబ్లీని అబద్ధాల వేదికగా మార్చారని దుయ్యబట్టారు. తాము రూ.4.17 లక్షల కోట్ల అప్పు చేస్తే, రూ.7 లక్షల కోట్లని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.

Similar News

News December 24, 2024

రష్యా ఆయిల్ దిగుమతి తగ్గింది.. మిడిల్ ఈస్ట్ నుంచి పెరిగింది

image

మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి NOVలో భారత్ క్రూడాయిల్ కొనుగోళ్లు 9 నెలల గరిష్ఠానికి చేరాయి. గత నెల ప్రతి రోజూ 2.28M బ్యారెళ్ల ముడిచమురు దిగుమతి జరిగింది. OCTతో పోలిస్తే ఇది 10.8% ఎక్కువ. ఇది మొత్తం దేశీయ క్రూడాయిల్ దిగుమతుల్లో 48%. ఇదే సమయంలో రష్యా నుంచి దిగుమతి తగ్గడం గమనార్హం. OCTలో రోజూ 1.58 మిలియన్ బ్యారెళ్ల కొనుగోళ్లు జరగగా, NOVలో 13% తగ్గింది. మొత్తం దిగుమతుల్లో ఇది 32%.

News December 24, 2024

బాక్సింగ్ డే టెస్టుకు హెడ్ దూరం?

image

BGTలో భారత్‌కు తలనొప్పిగా మారిన ట్రావిస్ హెడ్ బాక్సింగ్ డే టెస్టుకు దూరం కానున్నట్లు సమాచారం. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అతను ఇంకా కోలుకోలేదని వార్తలు వస్తున్నాయి. ఆసీస్ ప్రాక్టీస్ సెషన్‌లోనూ హెడ్ కనిపించలేదని తెలుస్తోంది. ఇవాళ జరిగే ఫిట్‌నెస్ టెస్టు తర్వాత నాలుగో టెస్టులో ఆడేది లేనిది క్లారిటీ రానుంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న హెడ్ 3 టెస్టుల్లో 2 సెంచరీలు చేసిన విషయం తెలిసిందే.

News December 24, 2024

X ప్రీమియం ప్లస్ ఛార్జీలు భారీగా పెంపు

image

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X తన ప్రీమియం ప్లస్ ఛార్జీలను దాదాపు 40 శాతం పెంచింది. ప్రస్తుతం భారత్‌లో నెలకు ధర రూ.1,300 కాగా ఏటా రూ.13,600గా వసూలు చేస్తోంది. దీన్ని నెలకు రూ.1,750, ఏటా రూ.18,300కు పెంచింది. అయితే 2025 జనవరి 21వ తేదీ కంటే ముందే బిల్లింగ్‌ సైకిల్‌ మొదలైన వారికి పాత ధరలకే ప్రీమియం ప్లస్ సేవలు అందనున్నాయి. ఈ చందాదారులకు పూర్తిగా యాడ్‌ ఫ్రీ కంటెంట్‌ లభిస్తుంది.