News December 23, 2024
అమెరికా పర్యటనకు జైశంకర్

విదేశాంగ మంత్రి జైశంకర్ మంగళవారం అమెరికా పర్యటనకు బయలుదేరనున్నారు. Dec 29 వరకు ఆగ్రరాజ్యంలో పర్యటిస్తారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఆ దేశ విదేశాంగ ప్రతినిధులతో చర్చిస్తారు. అలాగే భారత కాన్సుల్ జనరల్ సదస్సులో పాల్గొంటారు. మరికొన్ని రోజుల్లో బైడెన్ పదవీకాలం ముగుస్తుండడం, ట్రంప్ బాధ్యతలు చేపట్టబోతున్న తరుణంలో జైశంకర్ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
Similar News
News January 24, 2026
పశువులకు ‘ఉల్లి’తో సమస్య.. చికిత్స ఇలా

ఒక రోజులో పశువు తినే మొత్తం మేతలో 5 నుంచి 10 శాతానికి మించి ఉల్లిపాయలు ఉండకూడదని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అది కూడా వారంలో 2-3 రోజులు మాత్రమే ఇవ్వాలన్నారు. ‘ఈ పరిమితి మించితే పశువుల కళ్లు, మూత్రం ఎర్రగా మారిపోతాయి. ఆహారం తీసుకోవు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వెటర్నరీ వైద్యుల సూచనతో విటమిన్ ఇ, సెలీనియం, ఫాస్ఫరస్ ఇంజెక్షన్లు, లివర్ టానిక్‌లు, చార్కోల్ లిక్విడ్ లాంటివి అందించాలి.
News January 24, 2026
దోపిడీదారుల ప్రయోజనం కోసమే కట్టుకథలు: భట్టి

TG: కొంతకాలంగా సింగరేణిపై కట్టుకథలు, అడ్డగోలు రాతలు వచ్చాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాబందులు, గద్దలు, దోపిడీదారుల ప్రయోజనాల కోసమే ఈ కథనాలు వస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. కావాల్సిన వాళ్లకు టెండర్లు కట్టబెట్టడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనల్ని తీసుకొచ్చిందంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఈ రాతల వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని సందేహం వ్యక్తం చేశారు.
News January 24, 2026
ఇండియాకు గుడ్ న్యూస్.. తగ్గనున్న టారిఫ్స్?

భారతీయ ఉత్పత్తులపై విధిస్తున్న 50% టారిఫ్స్‌ను సగానికి తగ్గించే అవకాశం ఉన్నట్లు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ హింట్ ఇచ్చింది. ‘రష్యా ఆయిల్ కొనుగోలును ఇండియా తగ్గించింది. సుంకాలు ఇంకా అమల్లోనే ఉన్నాయి. వాటిని తొలగించడానికి ఒక మార్గం ఉంటుందని భావిస్తున్నాను’ అని US ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొంటున్నామనే కారణంతో ఇండియన్ ప్రొడక్ట్స్‌పై US 25% అదనపు సుంకాలు విధిస్తోంది.


