News December 23, 2024
ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ మృతి
ప్రముఖ సినీ దర్శకుడు, స్క్రీన్‌ప్లే రచయిత శ్యామ్ బెనగల్(90) మృతి చెందారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. బాలీవుడ్‌లో అంకుర్, భూమిక, నిషాంత్, కల్‌యుగ్, మంతన్ సహా ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. 1934లో డిసెంబర్ 14న HYD తిరుమలగిరిలో జన్మించిన ఆయనను పద్మశ్రీ, పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే సహా పలు అవార్డులు వరించాయి.
Similar News
News December 24, 2024
భూ రికార్డుల్లో తప్పులు చేస్తే క్రిమినల్ కేసులు!
TG: ప్రభుత్వం ధరణి స్థానంలో ‘భూ భారతి’ చట్టాన్ని తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ, మండలిలో ఆమోదం పొందిన ఈ చట్టం బిల్లుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. ఇందులో ప్రభుత్వం కఠిన నిబంధనలను పెట్టినట్లు తెలుస్తోంది. భూ రికార్డుల్లో తప్పులు చేస్తే అధికారులపై క్రిమినల్ కేసులతో పాటు ఉద్యోగం నుంచి తొలగించనున్నట్లు సమాచారం. ఏ స్థాయి అధికారి అయినా చర్యలు తప్పవని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.
News December 24, 2024
అకౌంట్లలోకి రూ.12,000.. ప్రభుత్వం కీలక నిర్ణయం
TG: భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏటా ₹12K అందించే పథకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకున్న వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయనుంది. ఈమేరకు ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి సమాచారాన్ని సేకరిస్తోంది. అయితే ఇప్పటికీ మార్గదర్శకాలు వెల్లడించకపోవడంపై పేదలు ఆందోళన చెందుతున్నారు. తొలి విడతలో ఈ నెల 28న ఖాతాల్లో ₹6K చొప్పున జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
News December 24, 2024
జాబ్ అప్లికేషన్‌కు 18% GST.. కేంద్రంపై ప్రియాంకా గాంధీ ఫైర్
అగ్నివీర్‌తో సహా ప్రతి ఉద్యోగ నియామక పరీక్షల దరఖాస్తులపై కేంద్రం 18% జీఎస్టీ విధిస్తోందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ ట్వీట్ చేశారు. యూపీలోని ఓ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాల దరఖాస్తుకు ఫీజు ₹1000 ఉంటే దానిపై జీఎస్టీ ₹180 అని పేర్కొన్నారు. పిల్లల్ని చదివించడం కోసం పేరెంట్స్ రూపాయి రూపాయి కూడబెడితే, ప్రభుత్వం వారి కలల్ని ఇలా ఆదాయ వనరుగా మార్చుకుంటోందని మండిపడ్డారు.