News December 23, 2024
PGRSకు 80 ఫిర్యాదులు: నంద్యాల ఎస్పీ
నంద్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఎస్పీ అర్జీలను స్వీకరించారు. PGRS కార్యక్రమానికి 80 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రతి ఫిర్యాదును సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎస్పీ అధిరాజ్ సింగ్ హామీ ఇచ్చారు. ASP యుగంధర్ బాబు పాల్గొన్నారు.
Similar News
News December 24, 2024
కొత్తపల్లి: పొలంలో గుర్తుతెలియని డెడ్‌బాడీ
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం ఎర్రమఠం గ్రామ సమీపంలోని పంట పొలాలలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. స్థానికుల వివరాల మేరకు.. ఎర్రమఠం గ్రామానికి చెందిన కొమ్ము శేఖర్ తన పొలానికి వెళ్లగా శవం కనిపించడంతో భయాందోళనకు గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది హత్యా? ఆత్మహత్యా? అన్నది పోలీసుల విచారణలో తేలనుంది.
News December 24, 2024
కర్నూలులో పతనమైన ఎండు మిర్చి ధర
కర్నూలు మార్కెట్లో ఎండు మిర్చి ధరలు భారీగా పడిపోయాయి. సోమవారం క్వింటా గరిష్ఠ ధర రూ.14,913 పలికింది. సరాసరి రూ.11,119, కనిష్ఠ ధర రూ.1,599తో విక్రయాలు సాగాయి. నెల క్రితం క్వింటా రూ.20 వేలు పలకగా ప్రస్తుతం భారీగా పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మొక్కజొన్న రూ.2,052, కందులు గరిష్ఠ ధర రూ.7,449లు పలికాయి. ఉల్లి క్వింటా గరిష్ఠ ధర రూ.3,200, సజ్జలు గరిష్ఠ ధర రూ.2,403లతో అమ్ముడయ్యాయి.
News December 24, 2024
శ్రీశైలం: 0.692 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి
శ్రీశైలంలోని ఎడమ విద్యుత్ కేంద్రంలో సోమవారం 0.692 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేపట్టారు. ఇందుకోసం జలాశయం నుంచి 1406 క్యూసెక్కుల నీటిని వినియోగించుకున్నారు. అదే క్రమంలో హెచ్ఎంఎస్ఎస్ కు 1645 క్యూసెక్కులు, మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌కు 2291 క్యూసెక్కులు, కేసీ కెనాల్‌కు 245 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు 1500 క్యూసెక్కుల చొప్పున మొత్తం 7296 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.