News December 23, 2024
BIG BREAKING: అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు
హీరో అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. తర్వాత బన్నీని అరెస్ట్ చేయగా హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.
Similar News
News December 24, 2024
Stock Markets: మెటల్, రియాల్టి షేర్లపై ఒత్తిడి
బెంచ్‌మార్క్ సూచీలు ఫ్లాటుగా మొదలయ్యాయి. నిఫ్టీ 23,723 (-31), సెన్సెక్స్ 78,434 (-111) వద్ద ట్రేడవుతున్నాయి. అనిశ్చితి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. IT, O&G షేర్లకు డిమాండ్ నెలకొంది. మెటల్, రియాల్టి, ఫార్మా, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలపై ఒత్తిడి ఉంది. టాటా మోటార్స్, TCS, NESTLE, BRITANNIA, BAJAJ AUTO టాప్ గెయినర్స్. JSW STEEL, TATA STEEL, AIRTEL, SBI LIFE టాప్ లూజర్స్.
News December 24, 2024
సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్?
TG: అల్లు అర్జున్ కాసేపట్లో చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. సీన్ ఆఫ్ అఫెన్స్ కోసం అవసరమైతే సంధ్య థియేటర్‌కు రావాల్సి ఉంటుందని పోలీసులు నిన్న బన్నీకి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ దాదాపు 10 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని సమాచారం. బన్నీ ఇటీవల ప్రెస్‌మీట్లో మాట్లాడిన ఆరోపణలపై విచారించే అవకాశం ఉంది. 11గంటలకు ఆయన PSకు వెళ్లనున్నారు.
News December 24, 2024
చలికాలంలో బరువు తగ్గించే ఫుడ్స్ ఇవే..
ఫైబర్ ఎక్కువగా ఉండే స్వీట్ పొటాటో తినడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. స్నాక్స్ తినాల్సిన అవసరం ఉండదు. క్యారెట్లో క్యాలరీలు తక్కువ, పీచు ఎక్కువ. దీంతో బరువు, BMI, కొవ్వును తగ్గించుకోవచ్చు. నిత్యం మన డైట్ మెనూలో ఆకుకూరలు ఉండాల్సిందే. వీటిలోని నీరు, విటమిన్లు, మినరల్స్ ఆకలిని సంతృప్తి పరిచి జీర్ణశక్తిని పెంచుతాయి. బీట్‌రూట్‌లో నీరు, ఫైబర్, ప్రొటీన్ ఉంటాయి. కాజు, బాదం, అవిసెలకు ప్రాధాన్యం తప్పనిసరి.