News March 16, 2024
HYD: శంభీపూర్ రాజుని కలిసిన మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి

ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజుని ఆ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శంభీపూర్ రాజు లక్ష్మారెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా మల్కాజిగిరి టికెట్‌ను తొలుత శంభీపూర్ రాజుకు ఇచ్చినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వీరి ఇద్దరి కలయికతో శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Similar News
News August 17, 2025
RR: దయనీయంగా ఆదర్శ ఉపాధ్యాయుల పరిస్థితి

తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో గంటల ప్రతిపాదికన విధులు నిర్వహిస్తున్న బోధన సిబ్బంది పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గత మూడు నెలలుగా వేతనాలు అందక నానా అవస్థలు పడుతున్నామని, కుటుంబ పోషణ భారంగా మరి అప్పుల పాలవుతున్నామని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పొరుగు సేవల సిబ్బంది కంప్యూటర్ ఆపరేటర్, పీడీ, నైట్ వాచ్‌మెన్, ఆఫీస్ సబార్డినేట్‌లకు సైతం 5నెలలకు పైగానే వేతనాలు రాలేదు.
News August 17, 2025
HYD: ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి.. రిమాండ్

ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి హతమార్చిన నిందితుడు కమర్‌ను ఉప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకొని శనివారం రిమాండ్‌కు తరలించారు. బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డ విషయం ఇంట్లో చెబుతాడన్న భయంతో కమర్ బాలుడిని హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
News August 16, 2025
HYD: ఖజానా దోపిడీ కేసులో ఇద్దరు అరెస్ట్

చందానగర్ ఖజానా దోపిడీ కేసులు ఇద్దరిని అరెస్టు చేసినట్లు మాదాపూర్ DCP వినీత్ తెలిపారు. బిహార్‌కు చెందిన ఆశిష్, దీపక్‌ను అరెస్టు చేశామని, వీరిని పుణెలో పట్టుకున్నామన్నారు. చోరీ కేసులో మొత్తం ఏడుగురు నిందితులను గుర్తించామని, నిందితులంతా బిహార్ వాసులుగా గుర్తించామన్నారు. నిందితుల నుంచి గోల్డ్ కోటెడ్ సిల్వర్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.