News December 23, 2024

మంచు మనోజ్ ఫిర్యాదులో సంచలన ఆరోపణలు!

image

TG: తన సోదరుడు విష్ణుతో పాటు ఆరుగురిపై మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వినయ్, విజయ్, కిరణ్, రాజ్‌తో పాటు శివల పేర్లను పేర్కొన్నారు. భార్య, పిల్లలకు ప్రాణహాని ఉందన్నారు. మోహన్ బాబుకు చెందిన యూనివర్సిటీతో పాటు ట్రస్ట్‌లో నిధుల దుర్వినియోగం జరిగిందని పేర్కొన్నారు. తన ఇంటికి విద్యుత్, నీటి సరఫరా లేకుండా కుట్ర పన్నినట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ కోసం హార్డ్ డిస్క్ దొంగిలించారని ఆరోపించారు.

Similar News

News December 24, 2024

బట్టతలకు చికిత్స దొరికేసినట్లేనా.?

image

బట్టతలపై జుట్టు మొలిపించే పరిష్కారం తమకు లభించిందని UK, పాక్‌ పరిశోధకులు ఓ ప్రకటనలో తెలిపారు. ‘చిట్టెలుకలపై గాయాలను మాన్పించే ప్రయోగం చేస్తున్న సమయంలో వాటికి డియాక్సీరిబోస్ అనే షుగర్‌ను ఇచ్చాం. దాన్ని ఇచ్చిన చోట ఎలుకలకు కొత్తగా జుట్టు మొలిచింది. మనిషి శరీరంలో ఈ షుగర్ అంతర్భాగం. దీన్ని వాడటం ద్వారా బట్టతలపై వెంట్రుకల్ని మళ్లీ తెప్పించేందుకు అవకాశం ఉంది’ అని వారు వివరించారు.

News December 24, 2024

ఇండియాలో మాట్లాడుకునే భాషలెన్నో తెలుసా?

image

చాలా దేశాలు కొన్నింటిని మాత్రమే అధికారిక భాషలుగా గుర్తిస్తుంటాయి. కానీ ఆయా దేశాల్లోని ప్రజలు మాట్లాడుకునే భాషలు ఎక్కువగా ఉంటాయి. అలా ఎక్కువ భాషలు మాట్లాడుకునే దేశాల్లో పాపువా న్యూ గినియా 820 భాషలతో తొలిస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో ఇండోనేషియా(710), నైజీరియా(524) ఉండగా నాలుగో స్థానంలో ఇండియా(453) ఉంది. అమెరికాలో 335 భాషలు, ఆస్ట్రేలియాలో 319 భాషలు మాట్లాడుకుంటారు.

News December 24, 2024

ట్రెండింగ్‌లో ‘We Stand With Allu Arjun’

image

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌కు ఆయన అభిమానుల నుంచి భారీగా మద్దతు లభిస్తోంది. ‘We Stand with Allu Arjun’ అన్న హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ ట్యాగ్‌తో 11వేలకు పైగా ట్వీట్స్ పడటం గమనార్హం. తమ హీరోను లక్ష్యంగా చేసుకున్నారని, ఆయన ఏ తప్పూ చేయలేదని ఫ్యాన్స్ అంటుండగా తప్పొప్పుల్ని న్యాయస్థానమే తేలుస్తుందని ప్రభుత్వ మద్దతుదారులు పేర్కొంటున్నారు.