News December 23, 2024
హైకోర్టును ఆశ్రయించిన పేర్ని నాని
AP: రేషన్ బియ్యం అక్రమాల కేసులో పోలీసుల నోటీసులను క్వాష్ చేయాలని మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కొడుకు కిట్టు హైకోర్టును ఆశ్రయించారు. రేపు దీనిపై కోర్టు విచారణ చేయనుంది. మరోవైపు రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో పేర్ని నాని భార్య జయసుధ ఏ1గా ఉన్నారు. రేపు ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్‌పై జిల్లా కోర్టులో విచారణ జరగనుంది.
Similar News
News December 24, 2024
బడ్జెట్‌పై ఆర్థికవేత్తలతో మోదీ సమాలోచనలు
కేంద్ర బడ్జెట్‌లో పొందుపరచాల్సిన అంశాలు, కేటాయింపులపై సలహాలు, సూచనలు తీసుకొనేందుకు ఆర్థికవేత్తలు, భిన్న రంగాల నిపుణులతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. Feb 1న నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. Niti Aayog Vice-Chairman సుమన్ బేరీ, CEO సుబ్రహ్మణ్యం, Chief Economic Advisor అనంత నాగేశ్వరన్, ఆర్థికవేత్త సుర్జిత్ భల్లా తదితరులు పాల్గొన్నారు.
News December 24, 2024
విమాన ప్రయాణికులకు షాకింగ్ న్యూస్
విమాన ప్రయాణికులకు BCAS షాక్ ఇచ్చింది. కొత్త హ్యాండ్ బ్యాగేజీ విధానం ప్రకారం ఇకపై ఒక్క బ్యాగ్‌ను మాత్రమే విమానంలోపలికి తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. దేశీయ లేదా అంతర్జాతీయ విమానంలో ప్రయాణించినా ఇది వర్తిస్తుంది. ఒకవేళ హ్యాండ్ బ్యాగ్ ఉన్నా మరొక బ్యాగ్ తీసుకెళ్లకూడదు. ఏదైనా అదనపు సామాను ఉంటే తప్పనిసరిగా చెక్ ఇన్ చేయాలి.
News December 24, 2024
అమరావతికి రూ.11 వేల కోట్ల హడ్కో రుణం: నారాయణ
AP: రాజధాని అమరావతి నిర్మాణానికి హడ్కో రూ.11 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకారం తెలిపిందని మంత్రి నారాయణ తెలిపారు. ఇవాళ ఢిల్లీలో ఆయన పర్యటించారు. ‘అమరావతికి రుణం కోసం జిందాల్ ఛైర్మన్ పీఆర్ జిందాల్‌తో భేటీ అయ్యా. రాష్ట్రంలో వేస్ట్ టు ఎనర్జీ కేంద్రాల ఏర్పాటుపై ఆయనతో చర్చించా. ఇప్పటికే జిందాల్ సంస్థ గుంటూరు, వైజాగ్‌లో రెండు ప్లాంట్లు ఏర్పాటు చేసింది’ అని ఆయన పేర్కొన్నారు.