News December 23, 2024
BIG NEWS.. త్వరలో 32,438 ఉద్యోగాలకు నోటిఫికేషన్
రైల్వేలో 32,438 గ్రూప్-D ఉద్యోగాల భర్తీకి RRB త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనుంది. జనవరి 23 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. అత్యధికంగా ట్రాక్ మెయింటైనర్ ఉద్యోగాలు-13,187, పాయింట్స్‌మెన్-5058, అసిస్టెంట్(వర్క్‌షాప్)-3077, అసిస్టెంట్(C&W) సహా మరికొన్ని ఉద్యోగాలున్నాయి. 18-36 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్ లేదా NCVT నుంచి NAC సర్టిఫికెట్, ITI ఉన్నవారు అర్హులు.
Similar News
News December 24, 2024
మనూ చాలా బాధపడింది: తండ్రి రామ్ కిషన్
భారత షూటర్ మనూ భాకర్‌ను ఖేల్‌రత్నకు నామినేట్ <<14958848>>చేయకపోవడంపై<<>> ఆమె తండ్రి రామ్ కిషన్ స్పందించారు. ‘ఆమెను షూటింగ్ క్రీడాకారిణికి బదులుగా క్రికెటర్ని చేసి ఉండాల్సింది. ఒలింపిక్స్‌లో ఎవరూ సాధించని రికార్డును నెలకొల్పింది. నా బిడ్డ దేశం కోసం ఇంకా ఏమి చేయాలని మీరు ఆశిస్తున్నారు? దీనిపై మనూ కూడా బాధపడింది. తాను ఒలింపిక్స్‌కు వెళ్లి దేశం కోసం పతకాలు సాధించకపోవాల్సిందని ఆవేదన వ్యక్తం చేసింది’ అని తెలిపారు.
News December 24, 2024
విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు: బుద్ధప్రసాద్
AP: ఈ నెల 28, 29 తేదీల్లో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరుగుతాయని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. విజయవాడలోని KBN కాలేజీలో ఈ సభలు జరుగుతాయని చెప్పారు. పర్యావరణంపై 170 మందితో ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తెలుగు భాషాభిమానులు, సాహితీవేత్తలు ఇందులో పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రసంగాలు, కవి సమ్మేళనాలు, సదస్సులు ఉంటాయని చెప్పారు.
News December 24, 2024
రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
AP ఫైబర్‌నెట్‌లో గత ప్రభుత్వం నియమించిన 410 మంది ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. మరో 200 మంది ఉద్యోగుల నియామకపత్రాలు పరిశీలిస్తున్నామని, లీగల్ నోటీసులు ఇచ్చి వివరణ కోరుతామని ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీరెడ్డి వెల్లడించారు. వైసీపీ అర్హత లేని వారిని నియమించిందని, కొందరు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల ఇళ్లల్లో పనిచేశారని వెల్లడించారు. వేతనాల పేరుతో రూ.కోట్లు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.