News December 23, 2024

టీమ్ ఇండియాకు బ్యాడ్ న్యూస్

image

భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ ఆరోగ్య పరిస్థితిపై BCCI కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రేలియాతో జరిగే తర్వాతి రెండు టెస్టులకూ ఆయన అందుబాటులో ఉండటం లేదని పేర్కొంది. రంజీ, SMATలో బౌలింగ్ ప్రదర్శన బాగానే ఉన్నా ఎడమ మోకాలులో వాపు గుర్తించినట్లు తెలిపింది. మడమ గాయం నుంచి కోలుకున్న ఆయనను వైద్య బృందం పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు యంగ్ ప్లేయర్ తనుశ్ కోటియన్ భారత జట్టులో చేరనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News February 19, 2026

‘పెద్ది’ విడుదలకు ముందే ₹150 కోట్ల బిజినెస్?

image

రామ్ చరణ్, బుచ్చిబాబు క్రేజీ కాంబోలో వస్తున్న‘పెద్ది’ నాన్-థియేట్రికల్ బిజినెస్‌లో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఏకంగా ₹130 కోట్లకు కైవసం చేసుకున్నట్లు సమాచారం. ఆడియో హక్కులు మరో ₹18 కోట్లు పలికినట్లు టాక్. ఏప్రిల్ 30న విడుదల కానున్న ఈ చిత్రం శాటిలైట్ హక్కులతో కలిపి రిలీజ్‌కు ముందే ₹150 కోట్లకు పైగా వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

News February 19, 2026

మామిడి కాయలకు ‘ఫ్రూట్ కవర్స్’తో లాభం

image

వాతావరణ పరిస్థితులు, పురుగులు, పండు ఈగ, ఇతర కీటకాల వల్ల మామిడి పంటకు నష్టం ఎక్కువగా ఉంటుంది. అందుకే నిమ్మ లేదా కోడి గుడ్డు సైజుకు మామిడి కాయ వచ్చాక ‘ఫ్రూట్ కవర్స్’ కట్టాలి. దీని వల్ల చెట్టుపై రసాయనాలు పిచికారీ చేసినా అవి పండుపై పడవు. అలాగే కవర్ కట్టిన కాయపై ఎలాంటి మచ్చలు, చీడపీడల లక్షణాలు కనిపించవు. ఇతర కాయల కంటే ఎక్కువ బరువు పెరిగి మంచి ధర పలుకుతాయి. ఈ కవర్స్ వాటర్ ప్రూఫ్. నీరు పడినా ఏమీ కావు.

News February 19, 2026

BELలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>)5 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. MBBS+AFIH(అసోసియేట్ ఫెలోషిప్ ఇన్ ఇండస్ట్రియల్ హెల్త్), MD, DCH, MS అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 14వరకు అప్లై చేసుకోవచ్చు. మెడికల్ ఆఫీసర్‌కు గరిష్ఠ వయసు 31ఏళ్లు కాగా.. Sr. మెడికల్ ఆఫీసర్ పోస్టుకు 38ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: https://bel-india.in