News December 23, 2024
రేపటి నుంచి సెలవులు
క్రిస్మస్ ఈవ్ సందర్భంగా తెలంగాణలో కొన్ని స్కూళ్లకు రేపు ఆప్షనల్ హాలిడే ఉండనుంది. ఇప్పటికే సంబంధిత పాఠశాలల నుంచి విద్యార్థుల పేరెంట్స్‌కు సమాచారం అందింది. 25, 26న పబ్లిక్ హాలిడేస్ ఉండటంతో ఆయా పాఠశాలలకు వరుసగా 3 రోజులు, మిగతావాటికి 2 రోజులు సెలవులు రానున్నాయి. అటు ఏపీలోనూ రేపు కొన్ని స్కూళ్లకు ఆప్షనల్, 25న పబ్లిక్ హాలిడే, 26న ఆప్షనల్ హాలిడే ఉండనుంది.
Similar News
News December 24, 2024
విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు: బుద్ధప్రసాద్
AP: ఈ నెల 28, 29 తేదీల్లో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరుగుతాయని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. విజయవాడలోని KBN కాలేజీలో ఈ సభలు జరుగుతాయని చెప్పారు. పర్యావరణంపై 170 మందితో ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తెలుగు భాషాభిమానులు, సాహితీవేత్తలు ఇందులో పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రసంగాలు, కవి సమ్మేళనాలు, సదస్సులు ఉంటాయని చెప్పారు.
News December 24, 2024
రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
AP ఫైబర్‌నెట్‌లో గత ప్రభుత్వం నియమించిన 410 మంది ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. మరో 200 మంది ఉద్యోగుల నియామకపత్రాలు పరిశీలిస్తున్నామని, లీగల్ నోటీసులు ఇచ్చి వివరణ కోరుతామని ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీరెడ్డి వెల్లడించారు. వైసీపీ అర్హత లేని వారిని నియమించిందని, కొందరు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల ఇళ్లల్లో పనిచేశారని వెల్లడించారు. వేతనాల పేరుతో రూ.కోట్లు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
News December 24, 2024
సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్
ఎన్నికల నిర్వహణ నిబంధనలు- 1961లోని రూల్ 93కి కేంద్ర ప్రభుత్వం సవరణలు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును కాంగ్రెస్ ఆశ్రయించింది. ఎన్నికల్లో అభ్యర్థులకు సంబంధించిన ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు(CCTV, వెబ్‌కాస్టింగ్ ఫుటేజీ) సామాన్యులకు అందుబాటులో ఉంచకుండా నిబంధనలు సవరించారు. సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా రూల్స్ మార్చడాన్ని కాంగ్రెస్ తప్పుబడుతూ రిట్ పిటిషన్ దాఖలు చేసింది.