News December 23, 2024
అన్ని వర్గాలను మోసం చేసిన రేవంత్ రెడ్డి: హరీశ్ రావు

అన్ని వర్గాల ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మెదక్ లో సర్వ శిక్షా ఉద్యోగుల నిరసనకు హరీష్ రావు మద్దతు పలికి మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో నిలదీసినా స్పందించలేదని పండిపడ్డారు. రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ సమస్య ముఖ్యమైనది కానీ ప్రజల సమస్యలు ముఖ్యం కావా అని ప్రశ్నించారు. ఇకనైనా సమగ్ర ఉద్యోగుల సమస్య పరిష్కరించాలన్నారు.
Similar News
News December 31, 2025
మెదక్ జిల్లాలో మహిళల భద్రతకు షీటీమ్స్: ఎస్పీ

మెదక్ జిల్లాలో మహిళలు, బాలికల భద్రతకు షీ టీమ్స్ పటిష్టంగా పనిచేస్తున్నాయని ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. డిసెంబర్‌లో ఈవ్ టీజింగ్ కేసుల్లో 2 ఎఫ్‌ఐఆర్‌లు, 7 పెట్టి కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 64 మందికి కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. కళాశాలలు, పాఠశాలలు, రద్దీ ప్రాంతాల్లో 38 అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. వేధింపులకు గురైతే 100 లేదా షీ టీమ్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
News December 30, 2025
BIG BREAKING: మెదక్: ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు!

TGలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా మొదలైంది. ఎన్నికల కమిషనర్ గిరిధర్ సుందర్ బాబు మెదక్ జిల్లాలోని నర్సాపూర్, రామాయంపేట, మెదక్, తూప్రాన్ మున్సిపాలిటీల కమిషనర్లతో నిర్వహించిన VCలో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడాలని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల లెక్క తేల్చాలని స్పష్టమైన ఆదేశాలు అందాయి. SHARE IT
News December 30, 2025
జవాబుదారీతనం పెంచడానికి సమాచార హక్కు చట్టం కీలకం: మెదక్ అదనపు కలెక్టర్

పారదర్శకత, జవాబుదారీతనం పెంచడానికి సమాచార హక్కు చట్టం కీలకమని అదనపు కలెక్టర్ మెంచు నగేశ్ అన్నారు. సమాచార హక్కు చట్టం-2005పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పౌరులకు చట్టం విధానాలు, దరఖాస్తు ప్రక్రియ, సమాచారం పొందే హక్కులు గురించి వివరంగా తెలియజేశారు. పౌర సమాచార అధికారులు (PIO), సహాయ PIOలు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. చట్టం ప్రకారం 30 రోజుల్లో సమాచారం అందించాలన్నారు.


