News December 23, 2024

కాంగ్రెస్ Vs బీఆర్ఎస్.. మధ్యలో అల్లు అర్జున్

image

TGలో అల్లు అర్జున్ కేంద్రంగా రాజకీయం నడుస్తోంది. బన్నీ అరెస్టైనప్పుడు KTR ట్వీట్‌తో దుమారం రేగింది. కుట్రపూరితంగా అతడిని ఇరికిస్తున్నారని INC, రేవంత్‌పై BRS విమర్శలు గుప్పించింది. ఎదురుదాడికి దిగిన INC.. AAకు బీఆర్ఎస్సే డైరెక్షన్స్ ఇస్తోందని ఆరోపించింది. మొత్తం వ్యవహారంలో AA, BRS అభిమానులు ఒకవైపు, కాంగ్రెస్ మరోవైపు ఉన్నాయి. మరి ఈ ‘సినీ రాజకీయం’ ఎక్కడివరకు వెళ్తుందో, ఎక్కడ ఆగుతుందో చూడాలి.

Similar News

News December 24, 2024

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో శుక్రవారం వరకు వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. 25, 26, 27 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల.. ఉత్తర కోస్తాలో అక్కడక్కడా వర్షాలు పడతాయని వివరించింది. కోస్తా తీరంలో 35-55 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. కోస్తాలోని అన్ని పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

News December 24, 2024

ఏపీలో BPCL పెట్రోకెమికల్ కాంప్లెక్స్: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు

image

ఆంధ్రప్రదేశ్ తూర్పుతీరం వెంబడి గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ-పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేసేందుకు బీపీసీఎల్ హామీ ఇచ్చిందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. దీనికోసం తొలుత రూ.6100 కోట్లను పెట్టుబడిగా పెట్టనుందని తెలిపారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం క్రమంగా పుంజుకుంటోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఏపీని ఎంచుకున్నందుకు బీపీసీఎల్‌కు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.

News December 24, 2024

యువరాజ్ బయోపిక్.. ఆ హీరో నటిస్తారా?

image

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బయోపిక్‌ను నిర్మిస్తామని బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, రవిభగ్ చందక్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ చతుర్వేది నటిస్తారని సమాచారం. తన అభిమానులతో చిట్‌చాట్ సందర్భంగా యువీ బయోపిక్‌లో నటించాలనుందని ఆయన తెలిపారు. దీంతో ఈ చిత్రంలో ఆయన నటిస్తారని టాక్. కాగా తన పాత్రలో సిద్ధార్థ్ అయితే బాగుంటుందని యువీ కూడా గతంలో చెప్పారు.