News December 24, 2024

టెలికం కంపెనీలకు ట్రాయ్ కీలక ఆదేశాలు

image

వాయిస్ కాల్స్, SMSల కోసం ప్రత్యేకంగా రీఛార్జ్ ప్లాన్లు తీసుకురావాలని జియో, ఎయిర్‌టెల్, VI, BSNL సంస్థలను ట్రాయ్ ఆదేశించింది. ప్రస్తుతం డేటా, కాల్స్, SMSలకు కలిపి ఈ సంస్థల ప్లాన్లు ఉన్నాయి. దీంతో డేటా అవసరం లేకున్నా ఫీచర్ ఫోన్లు వాడే వారు తప్పకుండా రీఛార్జ్ చేయించుకోవాల్సి వస్తోంది. 2 సిమ్‌లు వాడే వారూ ఒక నంబర్ వాడుకలో ఉండేలా రీఛార్జ్ చేసుకుంటూ నష్టపోతున్నారు. త్వరలో వీరి కష్టాలు తీరే అవకాశముంది.

Similar News

News January 16, 2026

SRPT: కలెక్టరేట్‌లో మున్సిపల్ వార్డుల వారిగా డ్రా

image

మున్సిపల్ CDMA ఆదేశాల మేరకు కలెక్టరేట్‌లో ఈ నెల 17న కలెక్టర్ సమక్షంలో వార్డుల వారీగా రిజర్వేషన్‌ల డ్రా తీయనున్నారు. దీంతో ఎన్నికల బరిలో నిలవాలనుకునే అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. తమకు అనుకూలమైన రిజర్వేషన్ రావాలని ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. గతంలో గెలిచిన వారితో పాటు, ఈసారి కొత్తగా పోటీ చేయాలనుకునే వారు కూడా ఈ డ్రా ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News January 16, 2026

కనకాంబరంలో పిండి నల్లి నివారణకు సూచనలు

image

పండ్లు, కూరగాయల పంటలను నష్టపరిచే పిండి నల్లి కనకాంబరం పంటను కూడా ఆశిస్తుంది. మొక్కల లేత కొమ్మలు, ఆకుల పూమొగ్గలు తెల్లటి పిండిలాంటి పదార్థంతో కప్పబడి ఉంటే పిండినల్లి ఆశించిందని గుర్తించాలి. ఈ పురుగులు రసం పీల్చి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. వీటి నివారణకు లీటర్ నీటికి 2ml డైమిథోయేట్ లేదా 2.5ml క్లోరిపైరిఫాస్ లేదా 0.3ml ఇమిడాక్లోఫ్రిడ్ కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.

News January 16, 2026

మీరు పాలించడానికి అర్హులేనా?: జగన్

image

AP: గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో YSRCP కార్యకర్త మందా సాల్మన్‌ హత్యకు TDP వర్గీయులే కారణమని మాజీ CM జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ‘రాజకీయ కక్షలతో ఇంకెంతమందిని బలితీసుకుంటారు? మీరు పాలించడానికి అర్హులేనా?’ అంటూ CM చంద్రబాబును ప్రశ్నించారు. రెడ్‌బుక్ రాజ్యాంగం ముసుగులో అరాచకాలు సాగిస్తున్నారని, అనారోగ్యంతో ఉన్న భార్యను చూడటానికి వచ్చిన వ్యక్తిని కిరాతకంగా చంపడం దుర్మార్గమని మండిపడ్డారు.