News December 24, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్య అంశాలు

image

∆}దమ్మపేట: పాఠశాల ఎదుట ఆందోళన∆} బయ్యారం: ధాన్యం కొనుగోలు సందర్శించిన ఎమ్మెల్యే∆} చర్ల: ఇన్ఫార్మర్ నెపంతో యువకుడి దారుణ హత్య ∆}భద్రాద్రి జిల్లా: బాలికపై లైంగిక దాడి.. ఫోక్సో కేసు నమోదు∆}ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్∆}ఖమ్మం: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి∆} భద్రాచలం:అర్హులైన పేదలకు ఇందిరమ్మ:MLA∆} ఖమ్మం:’అంగన్వాడీలకు పెండింగ్ ఇంటి అద్దెలు ఇవ్వాలి’

Similar News

News December 24, 2024

పోలీసు అధికారులను అభినందించిన పోలీస్ కమిషనర్

image

హత్య కేసులో నిందితులకు శిక్ష పడే విధంగా కృషిచేసిన పోలీస్ అధికారులను మంగళవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు. అనంతరం పోలీస్ అధికారులకు సీపీ రివార్డులను అందజేశారు. 2019 SEP 10న పెనుబల్లి పోలీస్ స్టేషన్ పరిధి బ్రహ్మాళకుంటలో హత్య జరిగింది. ఈ కేసులో ఆరుగురికి జీవిత ఖైదు, రూ.10వేల జరిమానా, ఒకరికి ఐదేళ్ల జైలుశిక్ష రూ.5వేల జరిమానా పడేలా పోలీస్ అధికారులు కృషి చేశారని సీపీ పేర్కొన్నారు.

News December 24, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవులు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 25(రేపు)న క్రిస్టమస్, 26న బాక్సింగ్ డే సందర్భంగా రెండ్రోజులు సెలవులు ప్రకటించామన్నారు. ఈ రెండు రోజులు మార్కెట్లో క్రయవిక్రయాలు జరగవని అన్నారు. తిరిగి ఈనెల 27 నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించాలని పేర్కొన్నారు.

News December 24, 2024

KTDM: తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు: రేంజర్

image

వెంకటాపురం మండలంలో పెద్దపులి సంచరిస్తుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని రేంజర్ చంద్రమౌళి అన్నారు. వెంకటాపురంలోని పలు ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తుందని, వాగు వద్ద నీరు తాగిందని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తప్పుడు ప్రచారాల కారణంగా స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు.