News March 16, 2024

ఎంపీ మాగుంటతో ఎమ్మెల్యే గొట్టిపాటి, దామచర్ల భేటీ

image

ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని శనివారం టీడీపీకి చెందిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌లు కలిశారు. ఒంగోలులోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో వారు భేటీ అయ్యారు. శనివారం సాయంత్రం తాడేపల్లిలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో ఎంపీ మాగుంట ఆయన కుమారు రాఘవరెడ్డి ఆ పార్టీలో చేరనున్నారు.

Similar News

News September 3, 2025

ప్రకాశం జిల్లాలో 121 ఎరువుల దుకాణాల్లో తనిఖీ

image

ప్రకాశం జిల్లాలో 121 ఎరువుల దుకాణాలను పోలీసులు తనిఖీ చేసినట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం మంగళవారం సాయంత్రం ప్రకటించింది. మంగళవారం ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అధిక ధరలకు యూరియా ఎరువుల విక్రయాలను నియంత్రించడమే లక్ష్యంగా బ్లాక్ మార్కెట్‌లో గల ఎరువులను గుర్తించేందుకు సైతం స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించారు.

News September 3, 2025

జాన్ వెస్లీకి నివాళులర్పించిన ప్రకాశం ఎస్పీ

image

ఒంగోలులోని చర్చి కూడలి వద్ద గల జాన్ వెస్లీ ఐపీఎస్ విగ్రహానికి మంగళవారం జిల్లా ఎస్పీ దామోదర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. YSR భద్రతా అధికారిగా విధులు నిర్వహించిన జాన్ వెస్లీ హెలికాప్టర్ ప్రమాదంలో వైయస్సార్‌తోపాటు ప్రాణాలు అర్పించి అమరులయ్యారు. ఈ నేపథ్యంలో జాన్ వెస్లీ 16వ వర్ధంతిని పురస్కరించుకొని ఎస్పీ దామోదర్ నివాళులు అర్పించారు.

News September 2, 2025

ప్రకాశం: పవన్ బర్త్ డే.. పోటాపోటీగా కేక్ కటింగ్స్!

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ప్రకాశం జిల్లా జనసేన నాయకులు పోటాపోటీగా కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. ఒంగోలులో జిల్లా జనసేన అధ్యక్షుడు రియాజ్, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, ఇతర నాయకులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. అయితే జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హైదరాబాదులోని తన ఇంటిలో నెల్లూరు జనసేన నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు.