News December 24, 2024

విజయనగరం: జిల్లాలో మూడు రోజుల‌పాటు భారీ వ‌ర్షాలు

image

విజయనగరం జిల్లాలో రానున్న మ‌రో మూడు రోజుల‌ు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని, జిల్లా యంత్రాంగ‌మంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బి.ఆర్ అంబేడ్కర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సోమ‌వారం ఒక మోస్త‌రు వ‌ర్షాలు, మంగ‌ళ‌, బుధ‌వారాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చిరిక‌ల నేప‌థ్యంలో రైతులంతా త‌గిన జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాల‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో క‌లెక్ట‌ర్‌ కోరారు.

Similar News

News December 25, 2024

విజయనగరం: మహిళ అనుమానాస్పద మృతి

image

విజయనగరం – కోరుకొండ రైల్వే స్టేషన్ మధ్యలో సారిక సమీపంలో పట్టాలు పక్కన గుర్తు తెలియని మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. రైల్వే ఎస్ఐ బాలాజీరావు వివరాలు మేరకు.. వయసు 25-30 ఏళ్ల మధ్యలో, ఐదు అడుగులున్న ఎత్తు ఉంటుంది. ఆమె వివరాలను గుర్తించిన వారు స్థానిక పోలీస్ స్టేషన్లలో సంప్రదించాలని కోరారు. 

News December 25, 2024

గంజాయి రవాణా పై కఠినంగా వ్యవహారించాలి: VZM SP

image

విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్‌లలో పని చేస్తున్న పోలీసు అధికారులతో మాసాంతర నేర సమీక్షను ఎస్పీ వకుల్ జిందల్ పోలీసు కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ.. గంజాయి రవాణ నియంత్రణలో కఠినంగా వ్యవహరించాలని, రవాణకు పాల్పడిన వారిని అరెస్టు చేస్తూనే, వారికి గంజాయి సరఫరా చేసిన వ్యక్తులు, మధ్యవర్తులుగా వ్యవహరించిన వారిని గుర్తించాలన్నారు.

News December 24, 2024

బొబ్బిలిలో యాక్సిడెంట్.. చికిత్స పొందతూ మృతి

image

బొబ్బిలి హైవేపై అదివారం స్కూటీపై ప్రయాణిస్తున్న యువకుడుని లారీ ఢీ కొట్టింది. గుర్ల మండలం గొలగంకి చెందిన నడిమువలస రాంబాబు (26) బొబ్బిలిలో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రెండు రోజులుగా ప్రాణాలతో పోరాడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమారై ఉన్నారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.