News March 16, 2024
HYD: ఏసీబీ వలలో జలమండలి అధికారులు

రెవెన్యూ సర్కిల్ జలమండలి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ఫైనాన్స్ ఎల్.రాకేశ్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సందీప్‌ను అక్బర్ హుస్సేన్ అనే వ్యక్తి కలిశారు. తన పని అవ్వాలంటే రూ.లక్ష లంచం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. దీంతో అక్బర్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. శుక్రవారం లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు రాకేశ్ దొరికాడు. నాంపల్లి ఏసీబీ కోర్టులో వారిని హాజరుపర్చగా కోర్టు రిమాండ్ విధించింది.
Similar News
News January 23, 2026
HYD: ఈ వెంకన్న భక్తుల మాటలు వింటాడట..?

మేడ్చల్‌లోని ఎంసీపల్లి ORR వద్దగల ఉద్దేమర్రి వేంకటేశ్వర స్వామి టెంపుల్ ఫేమస్. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గుడిలో వెంకన్న భక్తుల మాటలు వింటాడని ప్రతీతి. ఆయన ఆశీస్సుల కోసం జిల్లాలు దాటి ఇక్కడికి వచ్చిన భక్తులు, తమ కోర్కెను తీర్చాలని, కుటుంబ సభ్యులందరూ బాగుండాలని వేడుకుంటుంటారు. ‘వెంకన్న స్వామి.. వేయి దండాలు నీకు’ అంటూ శరణు కోరుతుంటారు. ఆ స్వామి మానసిక, ఆధ్యాత్మిక శక్తిని అందిస్తారని భక్తుల నమ్మకం.
News January 23, 2026
హైదరాబాద్‌లో ఎయిర్ క్వాలిటీ @240

HYDలో ఎయిర్ క్వాలిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధారణంగా పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్ క్వాలిటీ శుక్రవారం ఉప్పరపల్లిలో తెల్లవారుజామున 240కి చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. గత 15 రోజులతో పోలిస్తే గాలి నాణ్యత నిన్న తగ్గి ఇవాళ కాస్త పెరిగింది.
News January 23, 2026
HYDలో ఇదో అంతుచిక్కని మొక్క!

గ్రేటర్ పరిధి చెరువులు, కుంటల్లో గుర్రపు డెక్క అంతుచిక్కని సమస్యగా మారింది. గత 12 ఏళ్లుగా ఎన్నో పైలట్ ప్రాజెక్టులు, గుర్రపు డెక్క తొలగింపు పనులు చేపట్టినా ఫలితం లేదు. ఉప్పల్, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో గుర్రపు డెక్కను పూర్తిగా చంపేందుకు అంతర్జాతీయ నిపుణులతో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టినా ఫలితం రాలేదు. చెరువుల్లో అతిపెద్ద సమస్యగా మారిన గుర్రపుడెక్కను అంతంచేసే పరిష్కారమే లేదా? అని అడుగుతున్నారు.


