News December 24, 2024

NHRC ఛైర్మన్‌గా జస్టిస్ రామసుబ్రమణియన్

image

జాతీయ మానవహక్కుల కమిషన్(NHRC) ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్ బాధ్యతలు చేపట్టారు. ఈయన ఐదేళ్లపాటు లేదా వయసు 70ఏళ్ల వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. మద్రాస్ లా కాలేజీలో చదివిన ఈయన 1983 నుంచి 23 ఏళ్ల పాటు లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత మద్రాస్, ఉమ్మడి AP హైకోర్టు న్యాయమూర్తి, హిమాచల్ ప్రదేశ్ CJగా బాధ్యతలు నిర్వహించారు. 2019-23 మధ్య సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు.

Similar News

News January 12, 2026

2026లో యుగాంతం.. నిజమెంత?

image

కొత్త ఏడాది ప్రారంభమైన ప్రతిసారీ ‘యుగాంతం’ థియరీలు ముందుకొస్తుంటాయి. బాబా వాంగ వంటి వారిని పేర్కొంటూ ఊహాగానాలు పుట్టుకొస్తాయి. AI ప్రాముఖ్యత, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి దానికి సంకేతాలంటూ SMలో స్టోరీలు ఇప్పుడు వైరలవుతున్నాయి. ఏలియన్స్ భూమిని ఆక్రమిస్తారనే చర్చా జరుగుతుంది. వీటిలో ఏమాత్రం నిజం ఉండదని చరిత్ర చెబుతోంది. కేవలం SM ఆల్గారిథమ్ వల్లే ఇవి ప్రాముఖ్యత సంతరించుకుంటున్నాయి.

News January 12, 2026

RVNLలో ఇంజినీర్ పోస్టులు

image

రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్‌(<>RVNL<<>>) 25సైట్ ఇంజినీర్ పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహించనుంది. పోస్టును బట్టి బీఈ/బీటెక్ (ఎలక్ట్రానిక్స్& కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజినీర్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. ST/SC/EWS కేటగిరీకి చెందినవారు జనవరి 13న, OBCవారు జనవరి 14న, UR అభ్యర్థులు జనవరి 15న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. వెబ్‌సైట్: https://rvnl.org

News January 12, 2026

ఎంగేజ్మెంట్ చేసుకున్న శిఖర్ ధవన్

image

భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ప్రేయసి సోఫీతో నిశ్చితార్థం జరిగిన విషయాన్ని ఆయన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. ఈ మేరకు చేతికి రింగ్ ఉన్న ఫొటోను ఆయన షేర్ చేశారు. అంతకుముందు ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషాను 2012లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 2023లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.