News December 24, 2024
NLG: జనవరి 6 నుంచి శిక్షణ
NLG ప్రాంతానికి చెందిన సహాయ ఆచార్యులు/ లెక్చరర్స్/ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు, పరిశోధక విద్యార్థులకు తెలుగులో పరీక్ష మూల్యాంకనం, ప్రశ్నారచన పై ఆరు రోజుల శిక్షణ శిబిరం (జనవరి 6 నుంచి 11వ వరకు) నిర్వహించబడుతుందని ఎంజీ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచినవారు ఈనెల 31 వరకు తమ పేరును సంబంధిత వెబ్సైట్లో ఫార్మ్ డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తు చేయాలన్నారు.
Similar News
News December 25, 2024
క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి
రేపు క్రిస్మస్ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచానికి ప్రేమ, సేవా, కరుణ, త్యాగం, క్షమాగుణం వంటి అద్భుతమైన జీవన మార్గాలను అందించిన జీసస్ స్పూర్తిని కొనసాగించేందుకు మనమంతా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించుకుందామని మంత్రి పిలిపునిచ్చారు. ఏసుక్రీస్తు దయతో తెలంగాణలో ప్రజలంతా పాడిపంటలు, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు.
News December 24, 2024
NLG: గ్రామీణ మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ
నల్గొండ SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ రాంనగర్ (RSETI)లో పదో తరగతి చదువుకున్న గ్రామీణ నిరుద్యోగ మహిళలకు 30 రోజుల ఉచిత కుట్టు శిక్షణ అందజేస్తున్నామని సంస్థ డైరెక్టర్ రఘుపతి తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం ఉంటుందన్నారు. ఉమ్మడి నల్గొండకు చెందిన 19 నుంచి 45 ఏళ్ల లోపు వారు అర్హులని తెలిపారు. డిసెంబర్ 30 లోపు సంస్థ ఆఫీసులో సంప్రదించాలని సూచించారు.
News December 24, 2024
NLG: సన్నబియ్యం ఇచ్చేందుకు కసరత్తు!
పేదల జీవితాల్లో ఈ సంక్రాంతి కొత్త వెలుగులు తీసుకురానుంది. సంక్రాంతికి కొత్తగా తెల్ల రేషన్ కార్డులతో పాటు పేదలకు దొడ్డు బియ్యం బదులు సన్నబియ్యం ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 50వేల మందికిపైగా కొత్త రేషన్ కార్డులతో పాటు తమ పిల్లల పేర్లను చేర్పించేందుకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక రైతులకు కూడా రైతు భరోసా అందించేందుకు ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టింది.