News December 24, 2024
బాక్సింగ్ డే టెస్టుకు హెడ్ దూరం?
BGTలో భారత్‌కు తలనొప్పిగా మారిన ట్రావిస్ హెడ్ బాక్సింగ్ డే టెస్టుకు దూరం కానున్నట్లు సమాచారం. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అతను ఇంకా కోలుకోలేదని వార్తలు వస్తున్నాయి. ఆసీస్ ప్రాక్టీస్ సెషన్‌లోనూ హెడ్ కనిపించలేదని తెలుస్తోంది. ఇవాళ జరిగే ఫిట్‌నెస్ టెస్టు తర్వాత నాలుగో టెస్టులో ఆడేది లేనిది క్లారిటీ రానుంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న హెడ్ 3 టెస్టుల్లో 2 సెంచరీలు చేసిన విషయం తెలిసిందే.
Similar News
News December 25, 2024
నేడు ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ
AP: ఢిల్లీ పర్యటనలో ఉన్న CM చంద్రబాబు ఇవాళ బిజీగా గడపనున్నారు. తొలుత మాజీ PM వాజ్‌పేయి శతజయంతి వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం BJP జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగే NDA నేతల సమావేశానికి హాజరవుతారు. జమిలి, వక్ఫ్ బిల్లులపై చర్చిస్తారు. అలాగే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ సీఎం భేటీ అవుతారని సమాచారం. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వారి దృష్టికి తీసుకెళ్తారని తెలుస్తోంది.
News December 25, 2024
ఏపీకి రూ.446 కోట్లు విడుదల
AP: రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం గ్రాంటు రూ.446 కోట్లను కేంద్రం విడుదల చేసింది. 2024-25కుగానూ రెండో వాయిదా కింద రూ.421 కోట్లు, ఒకటో వాయిదా కింద పెండింగ్‌లో ఉన్న రూ.25 కోట్లను అందించింది. 13,097 గ్రామ పంచాయతీలు, 650 బ్లాక్ పంచాయతీలకు ఈ నిధులకు కేటాయించనున్నారు.
News December 25, 2024
ఛాంపియన్స్ ట్రోఫీ: హిస్టరీ, విజేతలు
వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. 1998లో ప్రారంభమైన ఈ ట్రోఫీలో 2009 నుంచి ICC ర్యాంకింగ్స్‌లోని టాప్-8 జట్లు పాల్గొంటున్నాయి. టెస్టులు ఆడని దేశాల్లో క్రికెట్ అభివృద్ధికి నిధుల సమీకరణే లక్ష్యంగా ఇది మొదలైంది. ఆరంభ ఎడిషన్‌లో SA విజేతగా నిలిచింది. 2000లో NZ, 2002లో శ్రీలంక-భారత్, 2004లో WI, 2006, 09లో AUS, 2013లో IND, 2017లో పాక్ టైటిల్‌ను సాధించాయి.