News December 24, 2024
‘మిషన్ భగీరథ’ ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్
TG: మిషన్ భగీరథ నీటి సరఫరాలో సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రభుత్వం 18005994007 టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన కాల్ సెంటర్‌ను HYDలోని మిషన్ భగీరథ హెడ్ ఆఫీసులో నిన్న ప్రారంభించారు. ఈ టోల్ ఫ్రీ నంబర్ 24/7 పనిచేస్తుంది. రాత్రి పూట వచ్చే కాల్స్ రికార్డు అవుతాయి. ఫిర్యాదు స్వీకరించిన 24 గంటల్లో సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News December 25, 2024
అఫ్గానిస్థాన్‌పై పాక్ ఎయిర్‌స్ట్రైక్.. 15 మంది మృతి!
అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వరుస ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. జెట్స్ ద్వారా బాంబులతో దాడి చేయగా పక్టికా ప్రావిన్స్‌లోని బార్మల్ జిల్లాలో చిన్నపిల్లలు, మహిళలతో సహా 15 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాగా, దాడులపై పాకిస్థాన్ అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. అఫ్గాన్ బార్డర్లో దాక్కున్న తాలిబన్లను లక్ష్యంగా దాడులు చేసినట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి.
News December 25, 2024
సన్నరకం ధాన్యానికి రూ.939 కోట్ల బోనస్
TG: ఈ సీజన్‌లో ఇప్పటివరకు 18.78 లక్షల టన్నుల సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వీటికి రూ.939 కోట్లు బోనస్ ఇవ్వాలని నిర్ణయించగా ఇప్పటికే రూ.531 కోట్లు రిలీజ్ చేసినట్లు పేర్కొంది. గత ఏడాది ఇదే సమయానికి 41.20 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఈ సారి 6 లక్షల టన్నులు అధికంగా సేకరించినట్లు అధికారులు తెలిపారు. ధాన్యం సేకరణలో కామారెడ్డి, NZB, మెదక్ ముందు వరుసలో ఉన్నాయి.
News December 25, 2024
ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పెంపు
TG: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును మరోసారి పెంచారు. నేటితో గడువు ముగియనుండగా, ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తూ బోర్డు అధికారులు ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని పేర్కొన్నారు. మరోసారి గడువు పెంపు ఉండదని సమాచారం. రాష్ట్రంలో ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్స్, మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.