News December 24, 2024
నేటి నుంచి స్కూళ్లకు సెలవులు

ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు స్కూళ్లకు సెలవు ఇచ్చారు. క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇస్తూ డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. అటు TGలో రేపు, ఎల్లుండి పబ్లిక్ హాలిడేలు ఉండటంతో వరుసగా 3 రోజులు సెలవులు వచ్చినట్లయింది. ఏపీలో రేపు పబ్లిక్ హాలిడే ఉండగా 26న ఆప్షనల్ హాలిడేగా ప్రభుత్వం ప్రకటించింది.
Similar News
News December 29, 2025
7 ఏళ్లకే చెస్ ఛాంపియన్.. ఈ చిన్నారి గురించి తెలుసా?

ఏడేళ్ల వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన ప్రజ్ఞిక గురించి నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. ఈ చిన్నారిని రాష్ట్రీయ బాల పురస్కార్ వరించింది. ఈ ఏడాది సెర్బియాలో జరిగిన “FIDE వరల్డ్ స్కూల్స్ చెస్ ఛాంపియన్‌షిప్-2025″లో U-7 బాలికల విభాగంలో స్వర్ణం సాధించింది. “నేను బెస్ట్ చెస్ ప్లేయర్ అవుతా” అని ఆమె మోదీతో చెెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఏపీకి చెందిన వీరి ఫ్యామిలీ గుజరాత్‌లో స్థిరపడింది.
News December 29, 2025
ఢిల్లీ హైకోర్టుకు Jr.NTR స్పెషల్ థాంక్స్

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘ఇప్పటి డిజిటల్ యుగంలో నా వ్యక్తిత్వ హక్కులను కాపాడేందుకు ప్రొటెక్టివ్ ఆర్డర్ పాస్ చేసిన ఢిల్లీ హైకోర్టుకు కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో అవమానకర పోస్టులు, వాణిజ్య అవసరాలకు అనుమతి లేకుండా తమ ఫొటోలు వాడటంపై పవన్ కళ్యాణ్, <<18640929>>Jr.NTR<<>> ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లను వేసిన విషయం తెలిసిందే.
News December 29, 2025
వీరిని పెళ్లి చేసుకుంటే రూ.లక్ష ప్రోత్సాహకం!

దివ్యాంగుల ఆర్థికాభివృద్ధి కోసం అందించే వివాహ ప్రోత్సాహక పథకాన్ని వినియోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం పిలుపునిచ్చింది. దివ్యాంగులు సాధారణ వ్యక్తులను లేదా మరో దివ్యాంగుడిని వివాహం చేసుకుంటే ప్రభుత్వం రూ. లక్ష ప్రోత్సాహకాన్ని ఇస్తుంది. అర్హులైన వారు వివాహమైన ఏడాదిలోపు <


