News December 24, 2024

HYD: పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్లి వస్తూ చనిపోయింది!

image

రాయదుర్గం PS పరిధిలో <<14956935>>శివాని అనే యువతి<<>> రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. CBITలో బీటెక్ 4వ ఏడాది చదువుతున్న శివాని నిజాంసాగర్‌లో పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్లి వచ్చింది. హాస్టల్‌కు వెళ్లేందుకు స్నేహితుడు వెంకట్ రెడ్డి బైక్ పై ఎక్కి నార్సింగి సర్వీస్ రోడ్డులో వెళ్తుండగా కారు ఢీకొట్టింది. దీంతో శివాని మృతిచెందగా వెంకట్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.

Similar News

News July 7, 2025

జూబ్లీహిల్స్‌ కోసం దండయాత్ర!

image

జూబ్లీహిల్స్‌ కోసం రాజకీయ పార్టీలే కాదు ఉద్యమకారులు దండయాత్రకు సిద్ధమయ్యారు. తమకు న్యాయం చేయకపోతే ఉప ఎన్నికలో పోటీ చేస్తామని INCని హెచ్చరించారు. ఓ వైపు TDP వ్యూహం రచిస్తోంది. తాను పోటీలో ఉంటానని యుగ తులసి పార్టీ అధ్యక్షుడు శివకుమార్ ప్రకటించారు. ఇక ఇండిపెండెంట్లు ఎంతమంది వస్తారో తెలియని పరిస్థితి. ప్రధాన పార్టీలైన INC, BRS, BJP గెలుపు కోసం సర్వ శక్తులు ఒడ్డాల్సిన పరిస్థితి నెలకొంది.

News July 7, 2025

టేస్టీ ఫుడ్: వరల్డ్‌లో హైదరాబాద్‌కు 50వ స్థానం

image

రుచికరమైన వంటకాల్లో బెస్ట్ సిటీ మన హైదరాబాద్ అని మరోసారి నిరూపితమైంది. టేస్ట్ అట్లాస్ ఇటీవల విడుదల చేసిన జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా ది బెస్ట్ ఫుడ్‌ లభించే నగరాల్లో HYDకు 50వ స్థానం దక్కింది. HYD బిర్యానీ, హలీమ్, ఇరానీ ఛాయ్, తెలంగాణ, ఆంధ్రా, రాయలసీమ, మొఘల్, టర్కిష్ రుచులు సిటీలో ఏ మూలకు వెళ్లిన లభిస్తాయి. అందరికీ అందుబాటులోనే ధరలు ఉండటం విశేషం. మరి సిటీలో మీ ఫేవరెట్ ఫుడ్ ఏది? కామెంట్ చేయండి.

News July 7, 2025

HYD: యుక్త వయసులో మెదడుపై ప్రభావం!

image

యుక్త వయసులోనే యువత మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. ఓ వైపు డ్రగ్స్, మద్యం మత్తు, మరోవైపు సైబర్ మోసం, ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకోవడంతో ఒక్కోసారి జీవితంపై విరక్తి చెంది మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో తల తిరగడం, ఒళ్లు వణికే పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి లక్షణాలు కలిగిన 18 మందికి పైగా ఈ నెలలో ఎర్రగడ్డ, ఉస్మానియా వైద్యులను సంప్రదించడం ఆందోళనకరం.