News December 24, 2024

నేడు పోలీసుల విచారణకు అల్లు అర్జున్!

image

TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఇవాళ ఉ.11 గంటలకు విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఇదే విషయంపై బన్నీ నిన్న తన లీగల్ టీమ్‌తో సమావేశమయ్యారు. ఇవాళ విచారణలో ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి? అనేదానిపై చర్చించినట్లు తెలుస్తోంది. వివాదానికి తావులేకుండా ఐకాన్ స్టార్ తన లాయర్‌తో కలిసి చిక్కడపల్లి పీఎస్‌లో విచారణకు హాజరవుతారని సమాచారం.

Similar News

News January 24, 2026

గ్రీన్‌లాండ్‌లో పెంగ్విన్‌లా? ట్రంప్‌పై నెటిజన్ల ట్రోలింగ్

image

గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న ట్రంప్ పెంగ్విన్‌తో ఉన్న AI ఫొటోను వైట్‌హౌస్ Xలో షేర్ చేసింది. అయితే గ్రీన్‌లాండ్‌ ఉండే ఉత్తరార్ధ గోళంలో పెంగ్విన్లు అసలు ఉండవని, అవి కేవలం అంటార్కిటికా వంటి దక్షిణార్ధ గోళంలోనే ఉంటాయంటూ నెటిజన్లు ట్రంప్‌ను ట్రోల్ చేస్తున్నారు. దావోస్‌లో జరిగిన భేటీలో యూరప్ దేశాలపై టారిఫ్ మినహాయింపులు ఇస్తూ గ్రీన్‌లాండ్‌పై ఒప్పందానికి ట్రంప్ మొగ్గు చూపారు.

News January 24, 2026

ESIC నోయిడాలో ఉద్యోగాలు

image

<>ESIC<<>> నోయిడా 19 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు జనవరి 28న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD, MS, DNB, DM, MCh, Dr.NB, MSc(మెడికల్ అనాటమీ, మెడికల్ ఫిజియాలజీ), PhD అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రొఫెసర్‌కు నెలకు రూ.2,22,543, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,47,986 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://esic.gov.in/

News January 24, 2026

సూర్యుడు మన అనారోగ్యాలను ఎలా దూరం చేస్తాడు?

image

సూర్యుడిని ఆరోగ్య ప్రదాతగా కొలుస్తాం. అందుకే ‘ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్’ అంటాం. అంటే ఆరోగ్యం సూర్యుని వల్ల కలుగుతుందని అర్థం. సూర్యకిరణాల వల్ల శరీరంలో విటమిన్ D తయారవుతుంది. ఇది ఎముకల పుష్టికి చాలా అవసరం. సూర్యోపాసనతో ఆత్మశక్తి పెరుగుతుంది. నేత్ర, హృదయ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ప్రాచీన కాలం నుంచి ఉన్న సంధ్యావందనం, సూర్య నమస్కారాల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం సూర్యరశ్మి ద్వారా ఆరోగ్యాన్ని పొందడమే!