News December 24, 2024
మోహన్‌బాబుపై చర్యలకు సిద్ధమవుతున్న పోలీసులు!

TG: జర్నలిస్టుపై దాడి కేసులో నటుడు మోహన్‌బాబుకు గతంలో హైకోర్టు ఇచ్చిన ఉపశమనం గడువు నేటితో ముగియనుంది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను నిన్న ధర్మాసనం కొట్టేసింది. దీంతో తదుపరి చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇవాళ ఆయనకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తారని సమాచారం.
Similar News
News January 2, 2026
తెలంగాణ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా మన్యం జిల్లా వాసి

మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం రెళ్ళ గ్రామానికి చెందిన పత్తిక శాన్వి బీసీసీఐ ఉమెన్స్ అండర్ -15 హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యింది. ఆమె సారథ్యంలో హైదరాబాద్ జట్టు నేడు విజయనగరం విజ్జి స్టేడియంలో జరుగుతున్న వన్డే ట్రోఫీలో తలపడుతోంది. శాన్వి తండ్రి ప్రవీణ్ కూడా రంజీ ప్లేయర్ కావడంతో ఆమెకు మరింత ప్రోత్సాహం తోడైంది. శాన్వి కెప్టెన్ కావడంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News January 2, 2026
NZలో ఆవు మూత్రం.. 2 లీటర్లకు రూ.13వేలు

న్యూజిలాండ్ ఆక్లాండ్‌లోని Navafresh అనే ఇండియన్ స్టోర్‌లో ఆవు మూత్రం, పేడ అమ్ముతుండటంతో అక్కడి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఆవు మూత్రం 2 లీటర్లకు 253 డాలర్లు (రూ.13వేలు), ఆవు పేడ కేజీ 220 డాలర్లు (రూ.11వేలు), ఆవు పేడతో చేసిన బేబీ పౌడర్ 214-250 డాలర్లుగా ఉన్నట్లు ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. వీటిలో శక్తిమంతమైన యాంటీ బయోటిక్స్ ఉంటాయని, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని వాటిపై రాసినట్లుందని ఆమె పేర్కొన్నారు.
News January 2, 2026
AMPRIలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

CSIR-అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (AMPRI)లో 13 పోస్టులకు అప్లై చేయడానికి జనవరి 4 ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిప్లొమా, బీఎస్సీ(సైన్స్, CS), టెన్త్, ఐటీఐ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. టెక్నికల్ అసిస్టెంట్‌కు నెలకు రూ.66,500, టెక్నీషియన్‌కు రూ.37,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ampri.res.in


