News March 16, 2024
ఉమ్మడి శ్రీకాకుళం YCP అభ్యర్థులు వీరే
☛ ఇచ్ఛాపురం – పిరియా విజయ
☛ పలాస – సీదిరి అప్పలరాజు
☛ టెక్కలి – దువ్వాడ శ్రీనివాస్
☛ పాతపట్నం – రెడ్డి శాంతి(బీసీ)
☛ శ్రీకాకుళం – ధర్మాన ప్రసాదరావు
☛ ఆముదాలవలస – తమ్మినేని సీతారాం
☛ నరసన్నపేట – ధర్మాన కృష్ణదాసు
☛ రాజాం – రాజేశ్
☛ ఎచ్చెర్ల – కిరణ్ కుమార్, ☛ పాలకొండ – కళావతి
Similar News
News November 22, 2024
అసెంబ్లీ నిరవధిక వాయిదా
AP: రాష్ట్ర అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. 10 రోజులపాటు కొనసాగిన సభలో మొత్తం 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం లభించింది. 75 ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. మొత్తం 59 గంటల 57 నిమిషాల పాటు సభ కొనసాగింది. ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు వైసీపీ ఈ సమావేశాలను బహిష్కరించింది.
News November 22, 2024
ఓ హీరో ఛాన్స్ అడిగాడు, చెప్పుతో కొడతానని చెప్పా: ఖుష్బూ
అప్పట్లో ఓ హీరో తనకు ఛాన్స్ ఇవ్వమని అడిగారని నటి ఖుష్బూ సుందర్ తెలిపారు. గోవాలో జరుగుతున్న ఇఫ్ఫీ వేడుకల్లో ఆమె మాట్లాడారు. ‘కెరీర్ తొలినాళ్లలో ఓ సినిమా సెట్స్‌లో ఉన్నప్పుడు హీరో నా దగ్గరికి వచ్చాడు. నాకు ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని అడిగాడు. నా చెప్పు సైజు 41. ఇక్కడే కొట్టాలా.. యూనిట్ అందరి ముందూ కొట్టాలా అని ఎదురుతిరిగా. అన్నిటికన్నా ఆత్మగౌరవమే ముఖ్యం’ అని ఆమె చెప్పుకొచ్చారు.
News November 22, 2024
మా ఇంట్లో జరిగింది రేవ్ పార్టీ కాదు.. బర్త్ డే పార్టీ: సుష్మిత
TG: మంత్రి <<14675277>>కొండా సురేఖ<<>> ఇంట్లో రేవ్ పార్టీ జరిగిందని జరుగుతోన్న ప్రచారంపై ఆమె కూతురు సుష్మితా పటేల్ స్పందించారు. తమ ఇంట్లో జరిగిందని రేవ్ పార్టీ కాదని, తన కూతురి పుట్టినరోజు వేడుక అని వెల్లడించారు. ఆ బర్త్ డే పార్టీలో ఎలాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరగలేదన్నారు. సురేఖ తన స్టాఫ్‌ను ఇంట్లో వాళ్లుగానే చూసుకుంటారని, అందుకే వేడుకకు వాళ్లను ఆహ్వానించారని ఆమె చెప్పారు.