News December 24, 2024
అల్లు అర్జున్‌ను విచారించేది వీరే..
TG: అల్లు అర్జున్ కాసేపట్లో తన లీగల్ టీమ్‌తో భేటీ కానున్నారు. అనంతరం ఆ టీమ్‌తోనే ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లనున్నారు. అల్లు అర్జున్‌కు నిన్న పోలీసులు BNS 35(3) కింద నోటీసులిచ్చారు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి చిక్కడపల్లి ఏసీపీ రమేశ్, సీఐ రాజు ఆయన్ను ప్రశ్నించనున్నారు. తొక్కిసలాట కేసులో బన్నీ A11గా ఉండగా, నాలుగు వారాల వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
Similar News
News December 25, 2024
క్రిస్మస్ అటాక్స్: నల్లసముద్రం మీదుగా రక్తం పారించిన రష్యా
ప్రపంచమంతా క్రిస్మస్ వేడుకలు జరుగుతుంటే ఉక్రెయిన్‌లో మాత్రం రక్తం పారుతోంది. డ్రోన్ దాడులకు రష్యా ప్రతీకారం తీర్చుకుంటోంది. ప్రధాన నగరాలే లక్ష్యంగా బాలిస్టిక్, క్రూయిజ్ మిసైళ్లను ప్రయోగిస్తోంది. విద్యుత్, ఇంధన కేంద్రాలను ధ్వంసం చేస్తోంది. ఈ దాడుల్లో కొందరు మరణించినట్టు సమాచారం. బుధవారం ఉదయం నుంచే నల్లసముద్రం మీదుగా శత్రువు మిసైళ్లను ప్రయోగించినట్టు ఉక్రెయిన్ ఎనర్జీ మినిస్టర్ ధ్రువీకరించారు.
News December 25, 2024
ఏడుపాయల అమ్మవారిని దర్శించుకున్న సీఎం
TG: మెదక్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తర్వాత మెదక్ చర్చిలో జరిగే కార్యక్రమానికి సీఎం వెళ్లనున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సీఎం వెంట పలువురు మంత్రులు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఉన్నారు.
News December 25, 2024
సంక్రాంతి సెలవుల్లో మార్పులు!
APలో స్కూళ్లకు సంక్రాంతి సెలవుల్లో మార్పులు ఉండనున్నాయి. అకడమిక్ క్యాలెండర్ 2024-25 ప్రకారం పండుగ హాలిడేస్ JAN 10-19 తేదీల్లో ఉంటాయని విద్యాశాఖ గతంలో పేర్కొంది. కానీ ఇటీవల భారీ వర్షాలతో చాలా జిల్లాల్లో స్కూళ్లకు కలెక్టర్లు సెలవులు ఇచ్చారు. దీంతో పనిదినాలు తగ్గొద్దంటే ఈ సెలవులు తగ్గించాలి. ఈసారి 11-15 లేదా 12-16 తేదీల్లో పొంగల్ హాలిడేస్ ఉండొచ్చని సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది.