News December 24, 2024

Stock Markets: మెటల్, రియాల్టి షేర్లపై ఒత్తిడి

image

బెంచ్‌మార్క్ సూచీలు ఫ్లాటుగా మొదలయ్యాయి. నిఫ్టీ 23,723 (-31), సెన్సెక్స్ 78,434 (-111) వద్ద ట్రేడవుతున్నాయి. అనిశ్చితి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. IT, O&G షేర్లకు డిమాండ్ నెలకొంది. మెటల్, రియాల్టి, ఫార్మా, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలపై ఒత్తిడి ఉంది. టాటా మోటార్స్, TCS, NESTLE, BRITANNIA, BAJAJ AUTO టాప్ గెయినర్స్. JSW STEEL, TATA STEEL, AIRTEL, SBI LIFE టాప్ లూజర్స్.

Similar News

News January 19, 2026

మాఘ గుప్త నవరాత్రుల గురించి మీకు తెలుసా?

image

మాఘమాసంలో శుక్లపక్ష పాడ్యమి నుంచి నవమి వరకు 9 రోజులను ‘మాఘ గుప్త నవరాత్రులు’ అంటారు. అయితే, ఇవి రహస్యంగా (గుప్తంగా) అమ్మవారిని ఉపాసించేవి. అందుకే వీటికి ఈ పేరు వచ్చింది. ఈ సమయంలో శక్తి స్వరూపిణి అయిన వారాహి దేవిని, దశమహావిద్యలను భక్తులు విశేషంగా ఆరాధిస్తారు. ముఖ్యంగా సాధకులు ఆధ్యాత్మిక శక్తి కోసం, ఆటంకాలు తొలగి కార్యసిద్ధి కలగడం కోసం ఈ నవరాత్రులలో కఠిన నియమాలతో పూజలు నిర్వహిస్తారు.

News January 19, 2026

రాష్ట్రంలో 140 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీలో 140 పోస్టులకు అప్లై చేయడానికి జనవరి 31 ఆఖరు తేదీ. మొత్తం పోస్టుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ 79, అసోసియేట్ ప్రొఫెసర్ 44, ప్రొఫెసర్ 17 ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ, PhDతో పాటు బోధన, రీసెర్చ్ అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://skltghu.ac.in/

News January 19, 2026

ఎన్నికల నగారా.. ఫిబ్రవరి 14న పోలింగ్?

image

TG: మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 21న షెడ్యూల్, ఫిబ్రవరి 14న పోలింగ్ నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అటు అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటుపై పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. మరి ‘ప్రేమికుల రోజు’ ఓటర్లు ఎవరిపై ప్రేమ కురిపిస్తారో చూడాలి.