News December 24, 2024
గుండెపోటుతో మాజీ క్రికెటర్ మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1735015812129_893-normal-WIFI.webp)
గుండెపోటు మరణాలు ప్రస్తుతం అందరినీ కలవరపెడుతున్నాయి. బెంగాల్‌కు చెందిన మాజీ క్రికెటర్ సువోజిత్ బెనర్జీ (39) గుండెపోటుతో మరణించారు. బెంగాల్ తరఫున 3 రంజీ మ్యాచులు, 4 లిస్ట్-A మ్యాచులు ఆడిన ఆయన ప్రస్తుతం లోకల్ టోర్నీల్లో ఆడుతున్నారు. నిన్న బ్రేక్ ఫాస్ట్ అనంతరం కునుకు తీసిన ఆయన గుండెపోటుకు గురై చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
Similar News
News February 5, 2025
చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు.. ఎస్పీ సూచనలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738747032258_20447712-normal-WIFI.webp)
చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం పరిశీలించారు. బందోబస్త్ ఏర్పాట్లను పర్యవేక్షణ చేసి, అధికారులకు పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
News February 5, 2025
ఢిల్లీలో కమలానికే పీఠం: చాణక్య స్ట్రాటజీస్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738762553423_367-normal-WIFI.webp)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో BJPదే విజయమని చాణక్య స్ట్రాటజీస్ తెలిపింది. బీజేపీకి 39-44 సీట్లు వస్తాయని పేర్కొంది. ఆప్ 25-28 స్థానాలు దక్కించుకుంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 2-3 సీట్లు వచ్చే ఆస్కారముందని తెలిపింది. అలాగే పీపుల్స్ పల్స్ సర్వే బీజేపీ 51-60 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఆప్ 10-19 స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొంది. కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాదని తెలిపింది.
News February 5, 2025
SWIGGY నికర నష్టం రూ.799 కోట్లు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738759019772_1199-normal-WIFI.webp)
FY25 మూడో త్రైమాసికంలో ఫుడ్ అగ్రిగేటర్ కంపెనీ స్విగ్గీ నష్టాలు మరింత పెరిగాయి. గతేడాది ఇదే టైంలో రూ.574 కోట్లు నష్టం చవిచూడగా ఈసారి నికర నష్టం రూ.799 కోట్లకు చేరుకుంది. FY25 Q3లో రూ.3,700 కోట్లుగా ఉన్న ఖర్చులు ఇప్పుడు రూ.4,898 కోట్లకు పెరగడమే నష్టాలకు కారణమని సమాచారం. ఆపరేషన్స్ రెవెన్యూ మాత్రం 31% వృద్ధిరేటుతో రూ.3049 కోట్ల నుంచి రూ.3993 కోట్లకు పెరిగింది. టాప్‌లైన్ సైతం 11% గ్రోత్ నమోదు చేసింది.