News December 24, 2024

NHRC ఛైర్‌పర్సన్ ఎంపికపై కాంగ్రెస్ విమర్శలు

image

నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్(NHRC) ఛైర్ పర్స‌న్‌గా సుప్రీం మాజీ జడ్జి సుబ్రమణియన్‌ను నియమించడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఇది రాజ్యాంగబద్ధంగా జరిగిన నియామకం కాదన్నారు. ఆయన్ను నియమించిన విధానం సరిగాలేదని, నియామకానికి ఉద్దేశించిన కమిటీ నిబంధనలను తుంగలో తొక్కిందన్నారు. తాము సూచించిన జడ్జిలకు అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉందని చెప్పారు.

Similar News

News January 30, 2026

జనవరి 30: చరిత్రలో ఈ రోజు

image

* 1882: US మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ జననం
* 1933: జర్మనీకి వైస్ ఛాన్స్‌లర్‌గా అడాల్ఫ్ హిట్లర్ నియామకం
* 1957: సినీ దర్శకుడు ప్రియదర్శన్ జననం
* 1948: భారత జాతి పిత మహాత్మా గాంధీ మరణం
* 2016: తెలుగు రచయిత్రి నాయని కృష్ణకుమారి మరణం
* 2016: భారత సైనిక దళాల మాజీ ఛీఫ్ జనరల్ కేవీ కృష్ణారావు మరణం
* అమరవీరుల సంస్మరణ దినం

News January 30, 2026

అల్లు అర్జున్-లోకేశ్ సినిమాలో శ్రద్ధా కపూర్?

image

తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించే అవకాశం ఉందని సినీవర్గాలు వెల్లడించాయి. డైరెక్టర్ ఆమెను సంప్రదించి స్టోరీ వినిపించినట్లు పేర్కొన్నాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. కాగా బన్ని ప్రస్తుతం అట్లీ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు. అందులో దీపికా పదుకొనె నటిస్తున్నారు.

News January 30, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.