News December 24, 2024
నో డిటెన్షన్ పాలసీని కొనసాగిస్తాం: తమిళనాడు మంత్రి

కేంద్రం రద్దు చేసిన ‘<<14964843>>నో డిటెన్షన్ పాలసీ<<>>’ని తమ రాష్ట్రంలో 8వ తరగతి వరకు కొనసాగిస్తామని తమిళనాడు మంత్రి అన్బిల్ స్పష్టం చేశారు. పరీక్షల్లో విఫలమైతే 5, 8 తరగతుల విద్యార్థులను అదే తరగతిలో కొనసాగించాలని కేంద్రం సూచించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో పేద కుటుంబాల పిల్లల చదువుకు ఇబ్బందులు ఎదురవుతాయని అన్బిల్ అన్నారు. ఈ పాలసీపై TG ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం.
Similar News
News November 10, 2025
అభిషేక్ సరైన ఓపెనర్: పీటర్సన్

ఆస్ట్రేలియా టూర్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన భారత బ్యాటర్ అభిషేక్ శర్మపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ సోషల్ మీడియాలో ప్రశంసించారు. ‘టీ20 క్రికెట్‌కు అభిషేక్ సరైన ఓపెనర్. ధైర్యం, టాలెంట్ ఉన్న బ్యాటర్. ఆస్ట్రేలియా టూర్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు’ అని పొగిడారు. 163 రన్స్‌తో ఆసీస్ టూర్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా అభిషేక్ నిలిచిన సంగతి తెలిసిందే.
News November 10, 2025
వంటింటి చిట్కాలు

*క్యాబేజీ కర్రీ వండినప్పుడు కాస్త పచ్చి వాసన వస్తుంటుంది. అది రాకుండా ఉండాలంటే.. కొద్దిగా నిమ్మరసం లేదా అల్లం ముక్క వేయండి.
* వంట చేసినప్పుడు చేతులు కాలితే బంగాళదుంపతో రుద్దితే మంట తగ్గుతుంది.
* దోశెల పిండి పులిస్తే అందులో కాస్త గోధుమ పిండి కలిపితే దోశెలు రుచిగా వస్తాయి.
* చెక్క గరిటలు వాసన వస్తుంటే కాస్త వెనిగర్ వేసిన నీటిలో పదినిమిషాలు నానబెట్టి తర్వాత శుభ్రం చేయాలి.
News November 10, 2025
నటుడు అభినయ్ మృతి

నటుడు అభినయ్(44) మరణించారు. కొన్నేళ్లుగా లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇవాళ చెన్నైలో కన్నుమూశారు. తన చివరి రోజుల్లో చికిత్సకు అవసరమైన డబ్బు కోసం ఆయన ఎదురుచూడాల్సి వచ్చిందని స్నేహితులు చెప్పారు. ధనుష్ తొలి సినిమా ‘థుల్లువాదో ఇళమై’తో అభినయ్ సినిమాల్లోకి అడుగుపెట్టారు. తెలుగు, తమిళ్, కన్నడలో సుమారు 15కు పైగా చిత్రాల్లో నటించారు. ఓరియో బిస్కెట్స్ సహా పలు యాడ్స్‌లోనూ కనిపించారు.


