News December 24, 2024

క్రిస్మస్ శుభాకాంక్షలు: వైఎస్ జగన్

image

క్రైస్తవులకు AP మాజీ CM YS జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ‘కరుణ, ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు. తద్వారా మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా మార్గనిర్దేశం చేశారు. దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం, త్యాగాలకు జీసస్‌ బాటలు వేశారు’ అని తెలిపారు.

Similar News

News December 25, 2024

భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం 24 గంటల్లో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాలో తేలిక నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. అటు ప్రధాన ఓడరేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

News December 25, 2024

ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ

image

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. వీరిద్దరూ పలు విషయాలపై చర్చించుకునే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అభివృద్ధి పనులపై చర్చిస్తారని సమాచారం. కాగా ఇంతకుముందే కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, అశ్వినీ వైష్ణవ్‌తో చంద్రబాబు భేటీ అయిన సంగతి తెలిసిందే.

News December 25, 2024

వాజ్‌పేయిని పొగుడుతూ రాహుల్‌కు మోదీ పంచ్!

image

పార్లమెంటరీ జీవితంలో వాజ్‌పేయి సుదీర్ఘకాలం ప్రతిపక్ష నేతగానే ఉన్నారని, ఆయన్ను ‘దేశద్రోహి’గా ముద్రవేసి కాంగ్రెస్ దిగజారినా హుందాగానే నడుచుకున్నారని PM మోదీ అన్నారు. LOP రాహుల్‌ను ఉద్దేశించే ఆయనిలా చెప్పారని విశ్లేషకులు అంటున్నారు. ఓడినా గెలిచినట్టు సంబరాలు చేసుకోవడం, పార్లమెంటులో చర్చ జరగకుండా అడ్డుకోవడం, విదేశాల్లో భారత్‌ను దూషించడం, వ్యవస్థల విశ్వసనీయతను ప్రశ్నించడాన్ని ఉదహరిస్తున్నారు. COMMENT