News December 24, 2024

మున్నేరుకు రిటైనింగ్ వాల్: మంత్రి పొంగులేటి

image

TG: మున్నేరు వరద ముంపు నుంచి ప్రజలను కాపాడేందుకు రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ‘రిటైనింగ్ వాల్‌కు భూసేకరణ చేపడతాం. ఖమ్మంలో మున్నేరుకు ఇరువైపులా కాంక్రీట్ వాల్స్ నిర్మిస్తాం. ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల పరిధిలో 23 కి.మీ మేర గోడ ఏర్పాటు చేస్తాం’ అని ఆయన వివరించారు.

Similar News

News December 25, 2024

చిరు కొత్త లుక్ వైరల్

image

మెగాస్టార్ చిరంజీవి గ్రేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వయసు పెరిగేకొద్దీ ఆయన ఇంకా యంగ్‌గా అవుతున్నారంటారు ఫ్యాన్స్. తాజాగా బయటికొచ్చిన చిరు ఫొటోలు చూస్తే అది నిజమే అనిపిస్తోంది. లేటెస్ట్ ఫొటోషూట్‌లో మెగాస్టార్ చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు. ఇక ఆయన నటిస్తున్న విశ్వంభర విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో మూవీలో చిరు నటించనున్నారు.

News December 25, 2024

ఎంఎస్ ధోనీ శాంటా క్లాజ్‌ గెటప్ చూశారా!

image

క్రిస్మస్‌ను టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కుటుంబంతో ఘనంగా జరుపుకొన్నారు. స్వయంగా ఆయనే శాంటా క్లాజ్ గెటప్‌తో కుటుంబీకులకు, బంధువులకు గిఫ్ట్‌లు ఇవ్వడం విశేషం. ఆయన సతీమణి సాక్షి సింగ్ అందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకోగా ధోనీ ఫ్యాన్స్ వాటిని వైరల్ చేస్తున్నారు.

News December 25, 2024

పంత్ ఆ విషయాన్ని నేర్చుకోవాలి: గవాస్కర్

image

భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ పరిస్థితుల్ని గౌరవించడం నేర్చుకోవాలని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సూచించారు. ‘అతడి ఆట దూకుడుగానే ఉంటుంది. కాదనను. కానీ క్రీజులోకి వచ్చిన తొలి అరగంట పాటు పరిస్థితుల్ని, మంచి బంతుల్ని గౌరవించడం నేర్చుకోవాలి. తను వచ్చేసరికే భారత్ 500 పరుగులు దాటేసి ఉంటే తప్ప ఆరంభంలోనే దూకుడు సరికాదు’ అని అభిప్రాయపడ్డారు.