News December 24, 2024
యువరాజ్ బయోపిక్.. ఆ హీరో నటిస్తారా?
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బయోపిక్‌ను నిర్మిస్తామని బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, రవిభగ్ చందక్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ చతుర్వేది నటిస్తారని సమాచారం. తన అభిమానులతో చిట్‌చాట్ సందర్భంగా యువీ బయోపిక్‌లో నటించాలనుందని ఆయన తెలిపారు. దీంతో ఈ చిత్రంలో ఆయన నటిస్తారని టాక్. కాగా తన పాత్రలో సిద్ధార్థ్ అయితే బాగుంటుందని యువీ కూడా గతంలో చెప్పారు.
Similar News
News December 25, 2024
భారీ వర్షాలు
AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం 24 గంటల్లో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాలో తేలిక నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. అటు ప్రధాన ఓడరేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
News December 25, 2024
ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. వీరిద్దరూ పలు విషయాలపై చర్చించుకునే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అభివృద్ధి పనులపై చర్చిస్తారని సమాచారం. కాగా ఇంతకుముందే కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, అశ్వినీ వైష్ణవ్‌తో చంద్రబాబు భేటీ అయిన సంగతి తెలిసిందే.
News December 25, 2024
వాజ్‌పేయిని పొగుడుతూ రాహుల్‌కు మోదీ పంచ్!
పార్లమెంటరీ జీవితంలో వాజ్‌పేయి సుదీర్ఘకాలం ప్రతిపక్ష నేతగానే ఉన్నారని, ఆయన్ను ‘దేశద్రోహి’గా ముద్రవేసి కాంగ్రెస్ దిగజారినా హుందాగానే నడుచుకున్నారని PM మోదీ అన్నారు. LOP రాహుల్‌ను ఉద్దేశించే ఆయనిలా చెప్పారని విశ్లేషకులు అంటున్నారు. ఓడినా గెలిచినట్టు సంబరాలు చేసుకోవడం, పార్లమెంటులో చర్చ జరగకుండా అడ్డుకోవడం, విదేశాల్లో భారత్‌ను దూషించడం, వ్యవస్థల విశ్వసనీయతను ప్రశ్నించడాన్ని ఉదహరిస్తున్నారు. COMMENT