News December 24, 2024
అమరావతికి రూ.11 వేల కోట్ల హడ్కో రుణం: నారాయణ
AP: రాజధాని అమరావతి నిర్మాణానికి హడ్కో రూ.11 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకారం తెలిపిందని మంత్రి నారాయణ తెలిపారు. ఇవాళ ఢిల్లీలో ఆయన పర్యటించారు. ‘అమరావతికి రుణం కోసం జిందాల్ ఛైర్మన్ పీఆర్ జిందాల్‌తో భేటీ అయ్యా. రాష్ట్రంలో వేస్ట్ టు ఎనర్జీ కేంద్రాల ఏర్పాటుపై ఆయనతో చర్చించా. ఇప్పటికే జిందాల్ సంస్థ గుంటూరు, వైజాగ్‌లో రెండు ప్లాంట్లు ఏర్పాటు చేసింది’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 25, 2024
2024లో 27% రాబడి ఇచ్చిన బంగారం
పెట్టుబడి పరంగా 2024లో బంగారం సిరులు కురిపించింది. ఏకంగా 27% రాబడి అందించింది. నిఫ్టీ 50, నిఫ్టీ 500 కన్నా ఇదెంతో ఎక్కువ. దేశాల యుద్ధాలు, ప్రభుత్వాలు కూలిపోవడం, జియో పొలిటికల్ అనిశ్చితి వల్ల గోల్డుకు గిరాకీ పెరిగింది. RBI సహా అనేక సెంట్రల్ బ్యాంకులు టన్నుల కొద్దీ కొనడం ధరల పెరుగుదలకు మరో కారణం. ట్రంప్ టారిఫ్స్ నేపథ్యంలో 2025లోనూ ఇదే ఒరవడి కొనసాగొచ్చని అంచనా. నేడు 24K బంగారం గ్రాము ధర ₹7,751.30.
News December 25, 2024
కొడుకు చనిపోయాడని హీరోయిన్ పోస్ట్.. నెటిజన్ల ఫైర్
‘ఈరోజు నా కొడుకు జోరో చనిపోయాడు. అతడు లేని నా లైఫ్ జీరో. నేను నా కుటుంబం షాక్‌లో ఉన్నాం’ అని హీరోయిన్ త్రిష Xలో పోస్ట్ చేశారు. దీంతో షాకైన ఫ్యాన్స్ ‘మీకు పెళ్లెప్పుడైంది? కొడుకు ఎప్పుడు పుట్టాడు?’ అని ఆరా తీశారు. తర్వాత ఆమె తన కుక్క చనిపోయిన ఫొటోలను షేర్ చేశారు. త్రిష చెప్పిన ‘కొడుకు’ కుక్క అని తెలియడంతో ‘ఆ విషయం ముందే చెప్పొచ్చుగా? ఎందుకు గందరగోళం సృష్టించడం?’ అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
News December 25, 2024
మరోసారి సత్యాగ్రహం: కాంగ్రెస్
నవ సత్యాగ్రహం పేరుతో మరోసారి సత్యాగ్రహ స్ఫూర్తిని రగిలించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ట్విటర్లో తెలిపింది. 1924, డిసెంబరు 26న కర్ణాటకలోని బెళగావిలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా గాంధీజీ పగ్గాలు స్వీకరించారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని బెళగావిలో రేపు ‘నవ సత్యాగ్రహ బైఠక్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొంది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో ఎల్లుండి ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపింది.