News December 24, 2024
ముగిసిన శ్యామ్ బెనగల్ అంత్యక్రియలు
సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్ అంత్యక్రియలు ముగిశాయి. ముంబైలోని శివాజీ పార్కులో రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు. ఆయన కుటుంబీకులు, సినీరంగ ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక సెలవంటూ అశ్రునయనాలతో నివాళులర్పించారు. ఆయన రూపొందించిన కళాఖండాల్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. మూత్ర పిండాల సమస్యతో శ్యామ్ సోమవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే.
Similar News
News December 25, 2024
ఏపీకి రావాలని మోదీకి చంద్రబాబు ఆహ్వానం
ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. రాష్ట్ర పరిస్థితులు, అభివృద్ధి గురించి మోదీతో చర్చించారు. అమరావతికి రూ.15 వేల కోట్ల సాయాన్ని వేగవంతం చేయాలని చంద్రబాబు కోరారు. విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపనకు రావాలని కోరగా మోదీ అంగీకరించారు. జనవరి 8న వైజాగ్ వస్తానని మోదీ చెప్పారు. దాదాపు గంటపాటు వీరిద్దరూ సమావేశమయ్యారు.
News December 25, 2024
2024లో 27% రాబడి ఇచ్చిన బంగారం
పెట్టుబడి పరంగా 2024లో బంగారం సిరులు కురిపించింది. ఏకంగా 27% రాబడి అందించింది. నిఫ్టీ 50, నిఫ్టీ 500 కన్నా ఇదెంతో ఎక్కువ. దేశాల యుద్ధాలు, ప్రభుత్వాలు కూలిపోవడం, జియో పొలిటికల్ అనిశ్చితి వల్ల గోల్డుకు గిరాకీ పెరిగింది. RBI సహా అనేక సెంట్రల్ బ్యాంకులు టన్నుల కొద్దీ కొనడం ధరల పెరుగుదలకు మరో కారణం. ట్రంప్ టారిఫ్స్ నేపథ్యంలో 2025లోనూ ఇదే ఒరవడి కొనసాగొచ్చని అంచనా. నేడు 24K బంగారం గ్రాము ధర ₹7,751.30.
News December 25, 2024
కొడుకు చనిపోయాడని హీరోయిన్ పోస్ట్.. నెటిజన్ల ఫైర్
‘ఈరోజు నా కొడుకు జోరో చనిపోయాడు. అతడు లేని నా లైఫ్ జీరో. నేను నా కుటుంబం షాక్‌లో ఉన్నాం’ అని హీరోయిన్ త్రిష Xలో పోస్ట్ చేశారు. దీంతో షాకైన ఫ్యాన్స్ ‘మీకు పెళ్లెప్పుడైంది? కొడుకు ఎప్పుడు పుట్టాడు?’ అని ఆరా తీశారు. తర్వాత ఆమె తన కుక్క చనిపోయిన ఫొటోలను షేర్ చేశారు. త్రిష చెప్పిన ‘కొడుకు’ కుక్క అని తెలియడంతో ‘ఆ విషయం ముందే చెప్పొచ్చుగా? ఎందుకు గందరగోళం సృష్టించడం?’ అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.