News December 24, 2024
శ్రీవారి భక్తులకు మరింత నాణ్యమైన సేవలు: బీఆర్ నాయుడు
శ్రీవారి భక్తులకు మరింత నాణ్యమైన సేవల్ని అందిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు హామీ ఇచ్చారు. ఈరోజు జరిగిన TTD ధర్మకర్తల మండలి సమావేశంలో ‘స్విమ్స్‌కు జాతీయ హోదాకు సిఫార్సు, అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీనివాసుడి ఆలయాల నిర్మాణం, ఒంటిమిట్ట కోదండ రామాలయ విమాన గోపురానికి రూ.43 లక్షలతో బంగారు కలశం, తిరుమలలో ప్రత్యేక ఫుడ్ సేఫ్టీ విభాగం’ నిర్ణయాలను తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
Similar News
News December 25, 2024
తెలంగాణ ప్రభుత్వానికి రాహుల్ అభినందనలు
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. ‘మనం ఇచ్చిన గ్యారంటీలను నెరవేరుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి శుభాకాంక్షలు. రవాణా, బీసీ సంక్షేమ శాఖలో చేపడుతున్న చర్యలు అభినందనీయం’ అని పొన్నం ప్రభాకర్ పేరిట ఆయన లెటర్ రాశారు. ప్రజలందరికీ న్యాయం జరిగేలా ఇలానే ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.
News December 25, 2024
WhatsAppలో అదిరిపోయే ఫీచర్
వాట్సాప్‌లో సూపర్ ఫీచర్ వచ్చింది. ఏదైనా డాక్యుమెంట్‌ను స్కాన్ చేయాలంటే ఇక థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేదు. నేరుగా వాట్సాప్‌లోనే స్కాన్ చేసి షేర్ చేసుకునే వెసులుబాటు వచ్చింది. ప్రస్తుతం iOS యూజర్లకు ఈ ఫీచర్ రాగా, త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకూ అందుబాటులోకి రానుంది. డాక్యుమెంట్ షేరింగ్ మెనూ ఓపెన్ చేసి, ‘SCAN DOCUMENT’పై క్లిక్ చేస్తే స్కాన్ చేసుకోవచ్చు. బ్లాక్&వైట్ మోడ్, PDF లాంటి ఆప్షన్లు ఉంటాయి.
News December 25, 2024
IND vs AUS: నితీశ్ కుమార్ రెడ్డిపై వేటు?
ఆస్ట్రేలియాతో రేపు జరిగే నాలుగో టెస్టుకు నితీశ్ రెడ్డిని జట్టు నుంచి తప్పించాలని టీమ్ ఇండియా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో స్పిన్నర్‌ను ఆడించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. సిరీస్‌లో నిలకడగా రాణిస్తున్న నితీశ్‌ను తప్పించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తొలి రెండు టెస్టుల్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారని గుర్తు చేస్తున్నారు.