News December 24, 2024
రేపు ఎన్డీయే నేతల సమావేశం

ఢిల్లీలోని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో రేపు ఎన్డీయే నేతలు సమావేశం కానున్నారు. అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యల వివాదంపై ప్రధానంగా చర్చించనున్నారు. దాంతో పాటు జమిలి, వక్ఫ్ బిల్లులు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ షేరింగ్‌పైనా మాట్లాడుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కూటమిలోని సీనియర్లందరూ ఈ సమావేశానికి హాజరవుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి.
Similar News
News January 25, 2026
ఇన్‌స్టా ‘స్మృతి’లను చెరిపేసిన పలాశ్ ముచ్చల్

స్మృతి మంధాన మాజీ లవర్ పలాశ్ ముచ్చల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెతో ఉన్న అన్ని ఫొటోలను డిలీట్ చేశారు. వీరిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. నవంబర్‌లో జరగాల్సిన పెళ్లి క్యాన్సిల్ అవ్వగా తాజా చర్యతో వారి బంధం పర్మనెంట్‌గా ముగిసినట్లు స్పష్టమవుతోంది. పలాశ్ ఆర్థికంగా మోసం చేశారని, పెళ్లి వేడుకల్లో ఓ <<18940645>>అమ్మాయితో అడ్డంగా<<>> దొరికిపోయారని విజ్ఞాన్ మానే అనే వ్యక్తి ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే.
News January 25, 2026
బొప్పాయిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు.. నివారణ ఇలా

ఫంగల్ ఇన్ఫెక్షన్లు లేదా ఆంత్రాక్నోస్ కారణంగా బొప్పాయి చెట్ల ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇవి పెద్దవిగా మారి ఆకులకు రంధ్రాలు ఏర్పడి రాలిపోతాయి. వ్యాధి తీవ్రమైతే పండ్లు నాశనమవుతాయి. ఈ లక్షణాలు కనిపించిన ఆకులను ఏరివేసి నాశనం చేయాలి. చెట్ల మొదట్లో నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి. లీటరు నీటికి మాంకోజెబ్ 2.5గ్రా. లేదా క్లోరోథలోనిల్ 2 గ్రా. కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు దఫాలుగా పిచికారీ చేయాలి.
News January 25, 2026
CMను కాపాడేందుకే భట్టి అవాస్తవాలు: హరీశ్ రావు

TG: సింగరేణి టెండర్లపై Dy.CM <<18943021>>భట్టి విక్రమార్క<<>> చెప్పినవన్నీ అవాస్తవాలని BRS నేత హరీశ్ రావు మండిపడ్డారు. CM రేవంత్‌ను ‘స్కామ్’ నుంచి కాపాడేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. గతంలో లేని సైట్ విజిట్ నిబంధనను తమ వారికి లబ్ధి చేకూర్చడానికే 2025లో తెచ్చారన్నారు. టెండర్ల ప్రక్రియలో నిపుణుల సంస్థలను పక్కన పెట్టి సింగరేణికి నష్టం కలిగించారని, లబ్ధిదారులెవరో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.


