News December 24, 2024
కాంగ్రెస్ ఆరోపణల్ని కొట్టిపారేసిన EC

MH అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. జాబితాలో ఏకపక్షంగా ఓటర్ల తొలగింపు, కొత్త ఓటర్ల చేర్పులు జరగలేదని స్పష్టం చేసింది. పోలింగ్ ముగిసే 5 PM నాటి డేటాను పూర్తి ఓటింగ్ సరళితో పోల్చడం సరికాదంది. అభ్యర్థులు నియమించిన ఏజెంట్లకు పోలింగ్ ముగిశాక ఇచ్చిన Form-17Cలోని ఓటింగ్ వివరాల్ని మార్చడం అసాధ్యమని తెలిపింది.
Similar News
News September 22, 2025
‘OG’ విలన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే!

పవన్ ‘OG’ మూవీ విలన్ ఇమ్రాన్ హష్మీ (46) ఓ ఇంటర్వ్యూలో తన ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పారు. ‘వారంలో 5రోజులు జిమ్ చేస్తాను. రోజూ ఓ గంట నడుస్తాను. షుగర్స్ అస్సలు తీసుకోను. లంచ్‌లో కూరగాయలు, పప్పు, రోటీలు తింటాను. నైట్ రోటీలు కూడా తినను. చికెన్ లేదా కూరగాయలు, పప్పు, పెరుగు వంటివి తింటా. ఇప్పుడు రోజులో 16 గం.లు ఫాస్టింగ్ చేస్తున్నా. రోజుకు కనీసం 6 గంటలు నిద్రపోతాను’ అని తెలిపారు.
News September 22, 2025
MP సుధా మూర్తికీ తప్పని సైబర్ వేధింపులు

రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి గుర్తుతెలియని వ్యక్తిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘SEP 5న నాకో వ్యక్తి ఫోన్ చేసి టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగినని చెప్పాడు. నా ఫోన్ నంబర్ ఆధార్‌కు లింక్ కాలేదని అన్నాడు. నాకు సంబంధించిన అభ్యంతరకర వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయన్నాడు. నా ఫోన్ కనెక్షన్ కట్ చేస్తున్నట్లు చెప్పాడు’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
News September 22, 2025
రేపు, ఎల్లుండి భారీ వర్షాలు: APSDMA

AP: రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.