News December 25, 2024
విలన్ పాత్రకు రూ.200 కోట్ల రెమ్యునరేషన్?

కథానాయకులు వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవడం తెలిసిందే. కానీ కన్నడ నటుడు యశ్ విలన్ పాత్రకు ఏకంగా రూ.200 కోట్లు తీసుకుంటున్నారని బాలీవుడ్లో టాక్ నడుస్తోంది. రణ్‌బీర్, సాయి పల్లవి జంటగా నితీశ్ తివారీ హిందీలో తెరకెక్కిస్తున్న రామాయణంలో రావణుడి పాత్ర చేయడానికి గాను యశ్ భారీగా డిమాండ్ చేశారని సమాచారం. పాత్రకు ఆయనే కరెక్ట్ అని భావించిన మేకర్స్, ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.
Similar News
News January 14, 2026
ఆధునిక యంత్రాలు వాడి అధిక ఆదాయం

పాడి పశువుల పోషణలో మణిబెన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాటికి మేలైన పచ్చగడ్డి, దాణా అందిస్తున్నారు. ఒక పశువు నుంచి మెషిన్ సాయంతో 9-14 లీటర్ల పాలను తీస్తున్నారు. 16 కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం వీరి దగ్గర 140 పెద్ద గేదెలు, 90 ఆవులు, 70 దూడలున్నాయి. మరో 100 గేదెలను కొనుగోలు చేశారు. డెయిరీ ఫామ్‌ను విస్తరించి ఈ ఏడాది 3 కోట్ల వ్యాపారం చేయాలని మణిబెన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
News January 14, 2026
సంక్రాంతి పంచే సందేశాలు

మకర సంక్రాంతిలో ‘మకరం’ అంటే మొసలి. సుఖాలకు అలవాటుపడి మార్పును నిరోధించే మనిషి మొసలి పట్టులో చిక్కుకున్న వాడితో సమానం. జీవితంలో కదలిక లేకపోతే ఆందోళనలు, అనారోగ్యాలు తప్పవని, మార్పును ఆహ్వానించడమే ఉత్సవమని ఈ పండుగ బోధిస్తుంది. అందుకే సంక్రాంతి వేళ స్నానాదులు, శివాభిషేకంతో మనసును శుద్ధి చేసుకోవాలి. మనసులో నిరంతరం సానుకూల కదలిక ఉండాలని, శత్రుత్వాలు వీడి కలిసి మెలిసి ఉండాలనేదే ఈ పండుగ ఇచ్చే సందేశం.
News January 14, 2026
‘భూ భారతి’ స్కామ్‌లో అధికారుల పాత్ర!

TG: భూ భారతి చలాన్ల దుర్వినియోగం కేసులో అధికారుల పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. RR, యాదాద్రి జిల్లాల్లోనే భారీగా అవినీతి జరగగా అక్రమార్కులతో తహశీల్దార్లు కుమ్మక్కయ్యారనే అనుమానాలున్నాయి. రూ.కోట్ల విలువైన భూములకు రూ.లక్షల్లో స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉండగా 40-50 రూపాయలే చలాన్ కట్టి మిగతా సొమ్మును కాజేశారు. కాగా ఈ భాగోతం బయటపడటంతో ప్రభుత్వం పోర్టల్‌లో ఇంటర్ఫేజ్ వ్యవస్థను బలోపేతం చేసింది.


