News March 16, 2024
ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ అభ్యర్థులు- 1/1

● ఆళ్లగడ్డ: గంగుల బ్రిజేంద్ర రెడ్డి
● శ్రీశైలం: శిల్పా చక్రపాణి రెడ్డి
● నందికొట్కూరు: డా.సుధీర్ దారా
● కర్నూలు: ఎం.డి ఇంతియాజ్
● పాణ్యం: కాటసాని రాంభూపాల్ రెడ్డి
● నంద్యాల: శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి
● బనగానపల్లె: కాటసాని రామి రెడ్డి
Similar News
News August 28, 2025
వరద ప్రభావిత జిల్లాల్లో నేడు సీఎం ఏరియల్ వ్యూ

TG: భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలమైన మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాలను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నట్లు సీఎస్ రామకృష్ణారావు తెలిపారు. ఆయా జిల్లాల్లో ఇవాళ కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున కలెక్టర్లు, ఎస్పీలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పొంగుతున్న నదులు, వాగుల వైపు ప్రజలు వెళ్లకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.
News August 28, 2025
యూఎస్ టారిఫ్స్ భారత్‌కు మేల్కొలుపు: రఘురామ్ రాజన్

యూఎస్ టారిఫ్స్ భారత్‌కు మేల్కొలుపు వంటిదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఫైనాన్స్ అనేవి ఇప్పుడు ఆయుధాలుగా మారుతున్నాయని ఇండియా టుడేతో చెప్పారు. అంతర్జాతీయంగా భారత్ ఈ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. యువతకు ఉపాధిని కల్పించేందుకు, అవసరమైన వృద్ధి రేటు 8-8.5% సాధించడంలో సంస్కరణలను ఆవిష్కరించాలన్నారు.
News August 28, 2025
భారీ వర్షాలు.. పలు రైళ్ల రద్దు

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఇవాళ కాచిగూడ-నాగర్సోల్, కాచిగూడ-కరీంనగర్, కరీంనగర్-కాచిగూడ, మెదక్-కాచిగూడ, బోధన్-కాచిగూడ, కాచిగూడ-నర్ఖేడ్, నాందేడ్-మేడ్చల్ ట్రైన్లను, రేపు నర్ఖేడ్-కాచిగూడ, నాగర్సోల్-కాచిగూడ రైళ్ల సేవలు రద్దు చేసినట్లు పేర్కొంది. పలు రైళ్లు దారి మళ్లింపు, పాక్షికంగా క్యాన్సిల్ చేసినట్లు వివరించింది.