News March 16, 2024
సత్యసాయి జిల్లా వైసీపీ అభ్యర్థులు వీరే

● మడకశిర: ఈర లక్కప్ప
● హిందూపురం: టి.ఎన్ దీపిక
● పెనుకొండ: కె.వి.ఉషశ్రీ చరణ్
● పుట్టపర్తి: దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి
● ధర్మవరం: కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి
● కదిరి: మక్బుల్ అహ్మద్
Similar News
News August 21, 2025
రోహిత్ తర్వాత వన్డే కెప్టెన్‌గా శ్రేయస్?

సీనియర్ కెప్టెన్ రోహిత్ స్థానంలో వన్డే కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను నియమించే యోచనలో BCCI ఉన్నట్లు జాతీయ మీడియా తెలిపింది. వచ్చే WCను దృష్టిలో పెట్టుకొని, సుదీర్ఘ ప్రయోజనాల దృష్ట్యా అయ్యర్‌కే కెప్టెన్సీ ఇచ్చే ఛాన్స్ ఉందని వెల్లడించింది. అటు టెస్టులు, T20లకు గిల్‌ను కెప్టెన్‌గా నియమించే అవకాశముంది. ఈ క్రమంలో గిల్‌కు పనిభారం కాకూడదని అయ్యర్‌కు వన్డే పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నట్లు పేర్కొంది.
News August 21, 2025
రాజ్యాంగ సవరణ బిల్లుపై కాంగ్రెస్‌కు బాధ ఎందుకు: కిషన్ రెడ్డి

TG: నిన్న లోక్‌సభలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ <<17462620>>బిల్లును<<>> దేశమంతా స్వాగతిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ బిల్లు అన్ని పార్టీలకు వర్తించేలా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే కాంగ్రెస్ ఎందుకు బాధ పడుతుందో అర్థం కావడం లేదన్నారు. బిల్లు విషయంలో INDI కూటమి వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరమని అన్నారు. రాజకీయాల్లో ఆరోపణలు వచ్చినప్పుడు స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలగాలన్నారు.
News August 21, 2025
సినీ కార్మికుల సమ్మెకు ఇవాళ ‘శుభం’ కార్డు?

నిర్మాతలు, సినీ ఫెడరేషన్ నాయకుల మధ్య చర్చలు క్లైమాక్స్‌కు చేరాయి. ఇవాళ మ.3 గంటలకు నిర్మాతలతో ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు భేటీ కానున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో ఫెడరేషన్ నేతలు సమావేశం కానున్నారు. వేతనాల పెంపు విషయంలో ఇరు వర్గాలు ఓ నిర్ణయానికి వచ్చి సమ్మెకు శుభం కార్డు పలుకుతాయని తెలుస్తోంది. సినీ కార్మికులు షూటింగ్‌లు బంద్ చేయడంతో పలు సినిమాల విడుదలపై ప్రభావం పడింది.