News December 25, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News September 13, 2025

ఘర్షణల తర్వాత తొలిసారి మణిపుర్‌లో అడుగుపెట్టిన మోదీ

image

ప్రధాని మోదీ మణిపుర్ చేరుకున్నారు. ఇంఫాల్‌ ఎయిర్‌పోర్టులో ఆయనకు గవర్నర్ అజయ్ భల్లా, సీఎస్ పునీత్ గోయల్ స్వాగతం పలికారు. రెండేళ్ల నుంచి మణిపుర్‌లో తీవ్ర అల్లర్లు చెలరేగుతున్న విషయం తెలిసిందే. దీనిపై కేంద్రాన్ని, ప్రధానిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ విమర్శలు కూడా చేసింది. ఈక్రమంలో ఘర్షణల తర్వాత మోదీ తొలిసారి మణిపుర్‌లో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

News September 13, 2025

‘మిరాయ్’కి తొలి రోజు భారీ కలెక్షన్స్

image

తేజా సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఫాంటసీ మూవీ ‘మిరాయ్’ నిన్న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం తొలి రోజు వరల్డ్ వైడ్‌గా ₹27.20 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మూవీ టీమ్ తెలిపింది. దీంతో ‘హనుమాన్’ తొలిరోజు(₹8 కోట్లు) కలెక్షన్స్‌ను దాటేసింది. తేజ కెరీర్లో ఇవే హయ్యెస్ట్ ఫస్ట్ డే ఓపెనింగ్స్. పాజిటివ్ టాక్ నేపథ్యంలో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశముంది.

News September 13, 2025

1GB ప్లాన్ ఎత్తేయడంపై వివరణ కోరిన TRAI

image

సరసమైన 1GB ఎంట్రీలెవల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ ఉపసంహరణకు గల కారణాలను తెలపాలని JIO, AIRTEL సంస్థలను TRAI కోరింది. రూ.249 ప్లాన్ ఎత్తేయడంతో వినియోగదారులపై మరింత భారం పడనుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆఫ్‌లైన్‌లో ఈ ప్లాన్ అందుబాటులో ఉందని JIO తెలుపగా.. వినియోగదారుల ప్రాధాన్యతల ఆధారంగా రూ.249 ప్లాన్‌ను తీసేసినట్లు AIRTEL పేర్కొంది. ప్రస్తుతం ఎంట్రీ లెవెల్ ప్లాన్ ₹299 నుంచి మొదలుకానుంది.