News December 25, 2024
ఏపీకి రూ.446 కోట్లు విడుదల
AP: రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం గ్రాంటు రూ.446 కోట్లను కేంద్రం విడుదల చేసింది. 2024-25కుగానూ రెండో వాయిదా కింద రూ.421 కోట్లు, ఒకటో వాయిదా కింద పెండింగ్‌లో ఉన్న రూ.25 కోట్లను అందించింది. 13,097 గ్రామ పంచాయతీలు, 650 బ్లాక్ పంచాయతీలకు ఈ నిధులకు కేటాయించనున్నారు.
Similar News
News February 5, 2025
పంచాయతీ ఎన్నికలకు వారంలో నోటిఫికేషన్?
తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలుకానుంది. కులగణన, జనాభా ఆధారంగా వారికి రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రభుత్వం స్పష్టతకు రావడంతో మరో వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం స్పందించకపోయినా, పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని సీఎం రేవంత్ చెప్పారు. దీంతో ఎన్నికల నిర్వహణకు ఎక్కువ టైం పట్టదంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
News February 5, 2025
మేడారంలో ఇవాళ్టి నుంచి శుద్ధి కార్యక్రమాలు
TG: ములుగు(D) తాడ్వాయి(మ) మేడారం మినీ జాతరకు సిద్ధమవుతోంది. ఇవాళ్టి నుంచి సమ్మక్క-సారలమ్మకు పూజలు ప్రారంభం కానున్నాయి. కన్నెపల్లిలో సారలమ్మ, మేడారంలోని సమ్మక్క ఆలయాల్లో అర్చకులు శుద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలయాల్లోని పూజా సామగ్రిని శుద్ధి చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. దేవతల పీటలను శుభ్రం చేసి, ముగ్గులతో సుందరంగా అలంకరిస్తారు. ఈ నెల 12 నుంచి 15 వరకు మినీ జాతర వేడుకలు నిర్వహిస్తారు.
News February 5, 2025
ఉమ్మితే భారీ జరిమానా.. బెంగాల్ యోచన
పొగాకు, పాన్ మసాలా నమిలి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయడం పశ్చిమ బెంగాల్‌లోని ప్రధాన సమస్యల్లో ఒకటి. దీన్ని అడ్డుకునేందుకు ఆ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకోనుంది. బహిరంగప్రాంతాల్లో ఉమ్మేవారిపై అత్యంత భారీగా జరిమానాలు విధించేలా ఓ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఇలాంటి చట్టం ఉన్నప్పటికీ భారీ మార్పులు, జరిమానాతో కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.