News December 25, 2024
గాంధీ వందేళ్ల జ్ఞాపకం.. 2 రోజులు CWC సమావేశాలు
ఏఐసీసీ అధ్యక్షుడిగా మహాత్మా గాంధీ బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రేపు, ఎల్లుండి కాంగ్రెస్ ప్రత్యేక భేటీ నిర్వహించనుంది. కర్ణాటకలోని బెలగావిలో జరిగే ఈ సమావేశానికి ‘నవ సత్యాగ్రహ బైఠక్’గా పేరు పెట్టింది. 26వ తేదీన CWC సభ్యులు, పీసీసీలు, సీఎల్పీలు సహా 200 మంది కీలక నేతలు హాజరై పలు అంశాలపై చర్చిస్తారు. 27న నిర్వహించే సంవిధాన్ ర్యాలీలో లక్ష మంది కార్యకర్తలు పాల్గొంటారు.
Similar News
News December 26, 2024
ఏపీలోకి జోరుగా పొరుగు రాష్ట్రాల మద్యం
AP: ప్రభుత్వం నూతన లిక్కర్ పాలసీ ప్రవేశపెట్టిన తర్వాత కూడా APలోకి పొరుగు రాష్ట్రాల మద్యం ఎక్కువగా వస్తోంది. ఈ ఏడాది NOV వరకు 1.89 లక్షల లీటర్ల మద్యాన్ని ఎక్సైజ్, పోలీస్ శాఖలు సీజ్ చేశాయి. ఈ నెలలో అనంతపురంలో పట్టుబడిన 30వేల బాటిళ్లనూ కలుపుకుంటే 2 లక్షల లీటర్లు దాటనుంది. ఇంకా కొన్ని బ్రాండ్ల ధరలు ఎక్కువగా ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది. గతేడాది ఇదే సమయానికి 71,365 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు.
News December 26, 2024
8 రోజులు.. రెండు డబుల్ సెంచరీలు, 2 శతకాలు
దేశవాళీ క్రికెట్‌లో సమీర్ రిజ్వీ విధ్వంసం సృష్టిస్తున్నారు. యూపీ తరఫున ఆడుతున్న అతను 8 రోజుల వ్యవధిలోనే రెండు డబుల్ సెంచరీలు, రెండు శతకాలు బాదారు. విదర్భపై 105 బంతుల్లో 202*, త్రిపురపై 97 బాల్స్‌లో 201*(ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ), హిమాచల్‌పై 153, పుదుచ్చేరిపై 137* పరుగులు చేశారు. కాగా ఐపీఎల్ వేలంలో అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం రూ.95 లక్షలకు సొంతం చేసుకుంది.
News December 26, 2024
ఇకపై అల్ట్రాటెక్ అనుబంధ సంస్థగా ICL
ఇండియా సిమెంట్స్ లిమిటెడ్(ICL)లో ప్రమోటర్లకున్న 32.72 శాతం వాటాను అల్ట్రాటెక్ సొంతం చేసుకుని కొనుగోలు ప్రక్రియను పూర్తిచేసింది. దీంతో అల్ట్రాటెక్ వాటా 55.49 శాతానికి చేరుకుంది. దీంతో ఇండియా సిమెంట్స్ ఎండీ శ్రీనివాసన్, భార్య చిత్ర, కుమార్తె రూప, ఇతర ప్రమోటర్లు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. ఇకపై సదరు సంస్థ తమకు అనుబంధంగా కొనసాగుతుందని అల్ట్రాటెక్ వెల్లడించింది.