News December 25, 2024
తీవ్ర అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
AP: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఇవాళ బలహీనపడుతుందని IMD వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా విస్తరించి ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయంది. కాగా బంగాళాఖాతంలో 2 రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.
Similar News
News December 26, 2024
ఇవాళ టెట్ హాల్‌టికెట్లు విడుదల
TG: జనవరి 2 నుంచి 20 వరకు జరగనున్న టెట్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను నేడు అధికారులు విడుదల చేయనున్నారు. అభ్యర్థులు https://tgtet2024.aptonline.in/tgtet/లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఎగ్జామ్స్‌కు 2,48,172 మంది అప్లై చేసుకున్నారు. వీరికి ఉ.9 నుంచి 11.30 వరకు, మ.2 నుంచి 4.30 వరకు రెండు సెషన్లుగా పరీక్షలు ఉండనున్నాయి. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో టెట్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.
News December 26, 2024
నేడు సీఎంతో సినీ ప్రముఖుల భేటీ.. విజయశాంతి ఏమన్నారంటే?
TG: ఇవాళ సీఎం రేవంత్‌తో సినీ ప్రముఖులు భేటీ కానుండటంపై విజయశాంతి స్పందించారు. ‘ఈ సమావేశంలో సినీ ఇండస్ట్రీపై విశ్లేషణాత్మక చర్చ జరగాలి. ఇకపై టికెట్ రేట్ల పెంపు ఉండదన్న సీఎం, మంత్రి వ్యాఖ్యలు, సంక్రాంతికి స్పెషల్ షోల అనుమతి, తెలంగాణ సినిమా, సంస్కృతి, చిన్నస్థాయి కళాకారులు, తక్కువ బడ్జెట్ మూవీలకు థియేటర్ల కేటాయింపుపైనా చర్చించాలి. వీటన్నిటిపై ఏకాభిప్రాయం వస్తుందని ఆశిద్దాం’ అని ట్వీట్ చేశారు.
News December 26, 2024
నాన్నకు క్యాన్సర్ సర్జరీ సక్సెస్: శివరాజ్ కూతురు నివేదిత
కన్నడ స్టార్ శివరాజ్ కుమార్‌కు USలో క్యాన్సర్ సర్జరీ విజయవంతంగా పూర్తయ్యింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చిన్న కుమార్తె నివేదిత ఇన్‌స్టాలో వెల్లడించారు. ‘ఈ కష్టకాలంలో నాన్న చూపిన స్థైర్యం మాలో ధైర్యాన్ని నింపింది. అభిమానులు, ఫ్రెండ్స్ ప్రేమ, ప్రార్థనలు, ఆశీర్వాదాలు మాకెంతో బలాన్ని ఇచ్చాయి. వారికి మా ధన్యవాదాలు. ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేస్తాం’ అని పోస్టు చేశారు.