News December 25, 2024
ప్రకాశంలో మొదటి సారి భూ ప్రకంపనలు ఎప్పుడు వచ్చాయంటే?
ప్రకాశం జిల్లాలోని తాళ్ళూరు, ముండ్లమూరు మండలాల్లో గత మూడు రోజులుగా 7 సార్లు భూ ప్రకంపనలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మన జిల్లాలో 1800వ సంవత్సరం నుంచి తరచూ భూ ప్రకంపనలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా 1905, 2016, 2021, 2023లో ఒంగోలు, బల్లికురవలో భూమి కంపించింది. మైనింగ్, భూగర్భజలాలు తోడేయడం భూప్రకంపనలకు కారణం అవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది
Similar News
News December 25, 2024
ఎందుకింత కక్ష…? చంద్రబాబు: ఎమ్మెల్యే తాటిపర్తి
ఎందుకింత కక్ష చంద్రబాబు అంటూ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ‘కేవలం వైఎస్ జగన్ హయాంలో నియమితులైనవారని సచివాలయ వ్యవస్థపైన కక్ష గట్టి వారి జీతానికి బయోమెట్రిక్ అటెండెన్స్ లింక్ చేశారు. నిజంగా మీలో చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ రంగంలోని అన్ని శాఖల్లో ఈ నిర్ణయాన్ని అమలు చేయగలరా?, ఈ వయసులో కడుపు మంట ఎందుకు?’ అంటూ Xలో పోస్ట్ చేశారు.
News December 25, 2024
తైక్వాండోలో సింగరాయకొండ విద్యార్థినికి గోల్డ్ మెడల్
ఢిల్లీలో జరిగిన నేషనల్ తైక్వాండో ఛాంపియన్ షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన ఇంటర్ విద్యార్థిని లీలామైత్రిని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి మంగళవారం సింగరాయకొండలో అభినందించారు. లీలామైత్రి సింగరాయకొండలోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చదువుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి మంచి పేరు తెచ్చేలా లీలామైత్రి చక్కని ప్రతిభ చూపడం గర్వనీయమని అభినందించారు
News December 24, 2024
ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం ఎస్పీ
జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రపంచానికి శాంతిని ప్రబోధించిన ఏసుక్రీస్తు మార్గం ఆచరణీయమైనదనీ, ప్రజలందరూ శాంతి, సంతోషాలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.