News December 25, 2024

HYD: చీకటి ప్రాంతాలే అడ్డాగా..!

image

HYD శివారు చీకటి ప్రాంతాలను చైన్ స్నాచింగ్, గంజాయి, అసాంఘిక కార్యక్రమాలకు ముఠాలు అడ్డగా మార్చుకుంటున్నట్లు వివిధ కేసుల్లో తెలిసింది. శామీర్‌పేట, పెద్ద అంబర్ పేట, ఔటర్ రింగ్ రోడ్డు సమీప ప్రాంతాల్లో అన్నోజిగూడ, యమ్నంపేట, ఘట్కేసర్, మాధవరెడ్డి బ్రిడ్జి, అవుషాపూర్, తోండుపల్లి జంక్షన్, మల్లంపేట నుంచి దుండిగల్ వైపు ప్రాంతాల్లో ముఠాలు తిష్ట వేస్తున్నాయి.

Similar News

News December 26, 2024

HYD: వారిని కించపరచొద్దు.. BSNLకి మాజీ ఎంపీ వినోద్ లేఖ

image

మొబైల్ ​ఫోన్​ సందేశం పేరిట జడ్జిలు, పోలీస్ అధికారులను కించపరచొద్దని BSNL HYD సీజీఎంకు BRS ​మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. సైబర్ క్రైమ్ అలెర్ట్ కోసం చేస్తున్న ప్రకటనల్లో ‘మీకు జడ్జిలు, పోలీసులు వీడియో కాల్స్ చేస్తూ సైబర్ క్రైమ్‌లకు పాల్పడవచ్చు’అని ఫోన్ కాల్‌కు ముందు వస్తోందన్నారు. ఇందులో తప్పు దొర్లుతోందని, ‘జడ్జిలు, పోలీసుల పేరిట’ అని ఇవ్వాలని కోరారు.

News December 26, 2024

HYD: 2030 నాటికి 20 వేల మెగావాట్ల ఇంధన ఉత్పత్తి: భట్టి

image

2030 నాటికి స్వచ్ఛమైన, స్థిరమైన 20 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. హరిత ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, జాతీయ స్థాయిలో పెట్టుకున్న లక్ష్యాన్ని అందుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ విధానాన్ని ప్రతిపాదించిందన్నారు.

News December 26, 2024

HYD సీపీ చేతనైతే ఆ పని చేయాలి: ఎంపీ రఘునందన్‌రావు

image

ప్రైవేట్ బౌన్సర్ల వ్యవస్థపై ఎంపీ రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే ఊరంతా కోపగించుకుటారని.. అందరికీ శత్రువులు అవుతారంటూ పెద్దలు చెప్పారని కామెంట్ చేశారు. రాష్ట్రంలో బౌన్సర్లను పెట్టుకుని నెట్టేయించే సంస్కృతిని తెచ్చిందే ఆనాడు TPCC చీఫ్‌గా పని చేసిన రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. HYD సీపీ సీవీ ఆనంద్ చేతనైతే బౌన్సర్ల మీద చర్యలు తీసుకోవాలన్నారు.