News December 25, 2024
నెల్లూరు: ప్రేమ పేరుతో మోసం.. 10 ఏళ్ల జైలుశిక్ష

ప్రేమపేరుతో మోసం చేసిన యువకుడికి జైలుశిక్ష పడింది. సూళ్లూరుపేట సాయినగర్‌కు చెందిన భానుప్రకాశ్(23) ఓ బాలికను ప్రేమిస్తున్నానని చెప్పి హైదరాబాద్ తీసుకెళ్లి అక్కడ లైంగిక దాడి చేశాడు. ఈ ఘటనపై పోక్సో కేసు నమోదైంది. భానుప్రకాశ్‌తో అతడి బంధువులు వెంకటేశ్వర్లు(46), సుభాషిణి(40), స్వాతి(22), రమేశ్(29), మాలకొండయ్య(40)కు జడ్జి సిరిపిరెడ్డి సుమ పదేళ్ల జైలుశిక్ష, రూ.20 వేలు జరిమానా విధిస్తూ తీర్పుఇచ్చారు.
Similar News
News January 12, 2026
నెల్లూరు ఎస్పీ గ్రీవెన్స్‌కి 105 అర్జీలు

నెల్లూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఎస్పీ అజిత వేజెండ్ల బాధితుల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 105 అర్జీలు వచ్చాయని తెలిపారు. వాటిలో ఎక్కువగా చీటింగ్ కేసులకు సంభందించి అర్జీలు వచ్చాయి. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. వచ్చిన ప్రతి అర్జీకి జవాబుదారీగా ఉండి సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలని అధికారులను కోరారు.
News January 12, 2026
ముత్తుకూరులో మోసం.. రూ.80 లక్షలతో మహిళ పరార్

ముత్తుకూరు మండలంలో భారీ చీటీ మోసం వెలుగులోకి వచ్చింది. అదే ప్రాంతానికి చెందిన అన్నపూర్ణమ్మ అనే మహిళ పొదుపు లీడర్‌గా చీటీలు వేయిస్తుంటారు. ఆమె సుమారు రూ.80 లక్షలతో పరారైనట్లు బాధితులు ఫిర్యాదు ఆరోపించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల వేదికలో వినతులు స్వీకరించిన ఎస్పీ డా.అజిత వేజెండ్ల నిందితురాలి ఆచూకిని గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
News January 12, 2026
ఊర్లకు వెళ్లేవారు LHMS యాప్‌ను సద్వినియోగం చేసుకోండి: ఎస్పీ

సంక్రాంతి పండుగను ప్రజలు సురక్షితంగా జరుపుకోవాలని ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల కోరారు. ఊర్లకు వెళ్లేవారు ఇళ్ల భద్రత కోసం LHMS యాప్‌ను వాడాలని సూచించారు. రహదారులపై రద్దీ దృష్ట్యా తనిఖీలు పెంచామన్నారు. మైనర్లు వాహనాలు నడపకుండా చూడాలని తల్లిదండ్రులను హెచ్చరించారు. సంప్రదాయం పేరుతో కోడిపందేలు, జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.


